బిగ్‌బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడుపై శిరోముండనం కేసు తాజాగా సంచలనం సృష్టిస్తుంది. నూతన నాయుడు.. అతని భార్య శ్రీకాంత్‌ను తీవ్రంగా గాయపరచి గుండు కొట్టించినట్లుగా దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు శ్రీకాంత్ తెలియజేయడంతో శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు నూతన్ నాయుడు భార్య మధుప్రియపై ఏ 1గా కేసు నమోదు చేశారు.

అలాగే నూతన్ నాయుడు సిబ్బంది వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై సెక్షన్ 307, 342, 323, 506, R/W 341PC, 3(1)B ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. మరోప్రక్క శ్రీకాంత్‌కు మద్దతుగా దళిత సంఘాలు విశాఖలో ఆందోళన చేపట్టాయి. ఈమధ్య కాలంలోనే తూర్పు గోదావరి జిల్లాలో ఒక దళిత యువకుడికి శిరోముండనం జరిగిన సంగతి తెలిసిందే.! ఈ సంఘటనపై రాష్ట్రపతి కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కర్నాటకలోని ఉడిపిలో ఉన్న నూతన్ నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సంఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన కర్రి శ్రీకాంత్ శిరో ముండనం కేసులోనూతన్ నాయుడుకు ఏమాత్రం సంబంధం ఉందన్న విషయాలు తేలాల్సి ఉంది. ఆగస్టు 24న పెందుర్తిలో ఈ ఘటన జరగ్గా.. 24గంటల్లో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన రోజే.. నెట్‌కాల్ నుంచి తన భార్యకు నూతన్ నాయుడు ఫోన్‌కాల్స్ చేసినట్టు తెలియజేసారు.

ఆ తర్వాత డాక్టర్ సుజాత, డాక్టర్ సుధాకర్, డాక్టర్ వాసుధేవ్‌కు నూతన్ నాయుడు పీవీ రమేష్ పేర్లతో ఫోన్లు చేశాడు. వరుసగా వారికి ఫోన్లు చేసి పెందుర్తి నుంచి కొందరు వస్తారని.. చూసుకోవాలని సమాచారం ఇచ్చాడు. సరిగ్గా అదే టైంలో డాక్టర్ సుధాకర్‌కు పీవీ రమేష్ పేరుతో ఫోన్ కాల్ రావడంతో ఆయనకు అనుమానం వచ్చింది. దాంతో వచ్చిన కాల్ సరైందో కాదో తెలుసుకునేందుకు పీవీ రమేష్ కు ఫోన్ చేయగా.. తాను చేయలేదని ఆ అధికారి చెప్పడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.
దాంతో పోలీసులు ఆ నెంబర్ పై నిఘా పెట్టగా.. ఆ కాల్స్ నూతన్ నాయుడు చేస్తున్నట్టుగా తేలింది. దాంతో ఆ నెంబర్ కాల్‌డేటా ఆధారంగా ఉడిపిలో ఉన్న నూతన్ నాయుడును అక్కడి పోలీసుల సహకారంతో అరెస్టు చేశామని తెలియజేసారు వైజాగ్ సీపీ మనీష్‌కుమార్ సిన్హా.

అయితే నూతన్‌నాయుడు తన పేరును పీవీ రమేష్ అని చెప్పడంపై కూడా పోలీసులు దృష్టి సారించారు. అతని పేరు ట్రూ కాలర్‌లో ఏపీ చీఫ్ సెక్రెటరీ ఏపీ సీఎంవో అని రావడాన్ని గుర్తించిన పోలీసులు.. ఆ పేరుతో ఇంకా ఏమేం మోసాలు చేశాదోనన్న కోణంలోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. బిగ్‌బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడు ఏకంగా తనను తానూ ట్రూ కాలర్‌లో సీఎంవో పీఎస్‌గా పరిచయం చేసుకోవడంపై పోలీసులు కూడా ఖంగుతిన్నారన్న ట్విస్ట్ అదిరింది కదూ..!



























