బుల్లితెర రియాలిటీ షో “బిగ్‌బాస్ సీజన్ 4” సీజ‌న్‌లో కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టి 10 రోజుల‌పైనే అయింది.‌తాజాగా ఈ షోలో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేందుకు ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ని కాస్త పెంచారు. అయితే ఈ 4వ సీజన్‌లో కంటెస్టెంట్‌లు చాలా మంది బిగ్ బాస్ హౌస్ షరతులను పాటించకపోవడంతో బిగ్‌బాస్‌కి కోపం వచ్చి అందరికీ పనిష్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగులోనే మాట్లాడాలి అన్న షరతును కంటెస్టెంట్లలో కొంతమంది లైట్ తీసుకున్నారు. అయితే కొంతమంది కంటెస్టెంట్‌లు తెలుగులోనే మాట్లాడినా, మరికొంత మంది అన్ని భాష‌ల‌ను క‌లుపుతూ మాట్లాడేస్తున్నారు. దీంతో ఇదంతా చూసి చిర్రెత్తిపోయిన‌ బిగ్‌బాస్ అంద‌రికీ క‌లిపి ప‌నిష్మెంట్ ఇచ్చాడు. “న‌న్ను క్ష‌మించండి, ఇప్ప‌టి నుంచి అందరం తెలుగులోనే మాట్లాడ‌తాము” అని అందరినీ బోర్డు మీద రాయమన్నారు.

అయితే ఈ పనిష్మెంట్ ‌పై నోయల్ బాగా హర్ట్ అయ్యి.. బోర్డు మీద రాసేటప్పుడు ఒక్క‌సారిగా బిగ్‌బాస్ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌ట్టుప‌ట్టాడు. అంతేకాకుండా మిగతా కంటెస్టెంట్‌ ల‌పై చిర్రుబుర్రులాడాడు. బ‌స్తీ మే స‌వాల్ అని చాలెంజ్ కూడా విసిరాడు. శనివారం నాగార్జున వస్తారుగా, ఆయనను ఒప్పించి వెళ్లిపోతానని కోపంతో రగిలిపోయిన నోయల్ ఈ విషయంలో బిగ్‌బాస్‌ సారీ చెప్పాలంటూ అంత బిల్డప్‌ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత కాసేపటికే సభ్యుల ఏకాభిప్రాయంతో కెప్టెన్‌ గా ఎన్నికై బాధ్యతలు కూడా ప్రారంభించాడు. మరి ఉన్నట్లుండి నోయెల్‌ ఎందుకు అంతలా కోపడ్డాడనే విషయం ఎవరికీ అర్థం కాలేదు. బిగ్ బాస్ హౌజ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్‌లలో నోయెల్ ఒకడు..

మరి అలాంటి నోయల్ కి ఏమైంది.? బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవాలనుకున్న నోయెల్‌, ఆ తరువాత కెప్టెన్‌గా ఎందుకు బాధ్యతలు తీసుకున్నాడు.? తెలుగు మాట్లాడ‌కుండా మోనాల్‌, అభిజిత్‌, అఖిల్ ఉంటె.. మ‌ధ్య‌లో నోయ‌ల్‌కు ఎందుకు శిక్ష విధించార‌ని ఆయ‌న ఫాన్స్ ప్ర‌శ్నిస్తున్నారు. అలా అని బిగ్‌బాస్ వ‌చ్చి సారీ చెప్పాల‌ని నోయల్ కోర‌డం స‌బ‌బు కాద‌ని ఈ విధంగా రకరకాలుగా మొదలైన కామెంట్లు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. మరి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వచ్చిన తర్వాతైనా నోయెల్‌ తన మనసులోని కోపాన్ని కింగ్ ముందు ఉంచుతాడేమో చూడాలి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here