Amar Deep: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి బుల్లితెర నటుడు అమర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన బుల్లితెర నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రన్నర్ గా బయటకు వచ్చారు. ఇలా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అమర్ బిగ్ బాస్ తర్వాత మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.

అమర్ ఈ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో ఆయన పట్ల ఆయన ఫ్యామిలీ పట్ల భారీ స్థాయిలో నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా తన ఫ్యామిలీని నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేశారు. ఇలాంటి సమయంలో అమర్ స్నేహితులు తన కుటుంబానికి అండగా నిలబడిన సంగతి మనకు తెలిసిందే. ఇలా అమర్ స్నేహితులలో ఒకరైనటువంటి నరేష్ లొల్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో ఆయన పై వచ్చిన విమర్శలు అన్నిటిని ఈయన తిప్పి కొడుతూ ఎన్నో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. అయితే ఇలా ఇతరుల క్రేజ్ ఉపయోగించుకుంటూ ఈయన వీడియోలు చేస్తూ తాను పాపులర్ అవుతున్నారని ఇలా అడుక్కోవడం దేనికి అంటూ చాలామంది ఈయన పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.
60 వేలు వచ్చాయి..
అందరూ తనని అడుక్కోవడం అంటూ ఉండగా ఈయన ఈ విషయంపై ఆలోచించి ఇటీవల ఒక వీడియోని షేర్ చేశారు. అందరూ నన్ను అడుక్కుంటున్నావంటున్నారు. అందుకే నా సబ్స్క్రైబర్లు అందరు నాకు ఒక్క రూపాయి దానం చేయండి అంటూ నిజంగానే బెగ్గర్ గా మారిపోయారు. ఇలా అందరి నుంచి రూపాయి కలెక్ట్ చేసి నా సబ్స్క్రైబర్స్ లో ఎవరైతే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారో వారికి ఇస్తానని తెలిపారు. అయితే ఇప్పటివరకు తను 60000 సంపాదించానని త్వరలోనే ఆ డబ్బు ఎవరికి ఇవ్వబోతున్నాను అనే విషయాన్ని తెలియజేస్తాను అంటూ నరేష్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.





























