అటు ఉత్తరాది నుంచి ఇటు దక్షిణాది వరకూ సంచలనం సృష్టించిన బిగ్ బాస్ షో తెలుగులో కూడా బాగానే క్లిక్ అయింది. ఇంతవరకు 3 సీజన్స్ ని విజయవంతం గా పూర్తి చేసుకున్న ఈ షో అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో అసలు మళ్ళీ ప్రసారమౌతుందో లేదోనన్న డైలామాలో ప్రేక్షకులుండగా బిగ్ బాస్ సీజన్ 4 పై తాజాగా స్టార్ మా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. త్వరలోనే బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నట్టుగా తీపి కబురు చెప్పింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను కూడా విడుదల చేసింది స్టార్ మా. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గత 4 నెలలు గా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

కరోనా ప్రభావంతో గత 4 నెలల నుండి ఎంటర్‌టైన్‌మైంట్ రంగానికి సంబంధించిన అన్ని పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయనే చెప్పవచ్చు. అయితే తెలంగాణా ప్రభుత్వం షూటింగ్ లకు ఈమధ్య అనుమతి ఇవ్వడంతో తాజాగా స్టార్ మా ఈ షోకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు తాజా సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4 ప్రతి ఏడాది జూలై మొదటి వారంలో ప్రారంభం కానుండగా, ఈ ఏడాది కూడా అదే టైంకి ప్రారంభించాలని స్టార్ మా చాలా గట్టిగానే ప్రయత్నిస్తుందట. ఇక బిగ్ బాస్ 4 సీజన్ లో ఉండే కంటెస్టెంట్ ల యొక్క లిస్ట్ పైనే ప్రేక్షకులంరిలోనూ ఆసక్తి మొదలైంది. కంటెస్టెంట్స్‌గా ఈ సారి మరింత స్టార్ క్యాస్ట్ యాడ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది స్టార్ మా. దీనికోసం భారీగానే ఖర్చు పెట్టి బాగా పాపులరైన వాళ్లనే బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లోకి ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంతవరకు సోషల్ మీడియాలో మాత్రం బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు వీళ్ళేనంటూ ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఆ లిస్ట్ ప్రకారం చూస్తే.. ఆ జాబితాలో ఎవరెవరున్నారో మీరే చదివి తెలుసుకోండి.
టాలీవుడ్ కింగ్ నాగార్జున

ఇంతవరకూ తెలుగులో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్స్ కి మేల్ ఆర్టిస్ట్ లు మాత్రమే హోస్ట్ గా వ్యవహరించారు. నెం.1 సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, నెం.2 సీజన్ కి హీరో నాని, నెం.3 సీజన్ కి టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు కొత్తగా మొదలవ్వబోతున్న బిగ్ బాస్ సీజన్ 4 షోని ఫిమేల్ సెలబ్రిటీతో నిర్వహించాలని అనుకున్నారట. అందులో భాగంగానే సమంత పేరును పరిశీలించారు. కానీ ఫైనల్ గా సీజన్ 4 కూడా నాగార్జున చేతుల్లోనే పెట్టాలని చూస్తున్నారు నిర్వాహకులు. మహేష్ బాబు, రవితేజ లాంటి పేర్లు వినిపించినా చివరికి నాగ్ సెట్టయ్యాడని తెలుస్తుంది.
టాలీవుడ్ ఐటమ్ క్వీన్ హంసా నందిని

టాలీవుడ్ ఐటం క్వీన్ హంసా నందిని కూడా ఈ సారి బిగ్ బాస్ సీజన్4 లో ఉండబోతుందని తెలుస్తుంది. గ్లామర్ కోసం ఎక్కువగా మాజీ హీరోయిన్స్ ను తీసుకుంటున్నారు నిర్వాహకులు.
టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్

హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్‌కు ప్రస్తుతం ఎలాగో సినిమా ఆఫర్స్ లేవు.. అందుకే బిగ్ బాస్ సీజన్ 4 వైపు అడుగులేస్తుందని సమాచారం.
టాలీవుడ్ లవర్ బోయ్ తరుణ్

ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ హీరో తరుణ్ బిగ్ బాస్ 4 సీజన్ కోసం హౌస్ లోకి వస్తున్నాడని తెలుస్తుంది. ఈయన్ని గత సీజన్ కోసమే అడిగినా కూడా కొన్ని కారణాల వలన రాలేకపోయాడు. ఈసారి మాత్రం తప్పకుండా ఒప్పించే పనిలో ఉన్నారు బిగ్ బాస్ షో నిర్వాహకులు.
టాలీవుడ్ ఆర్టిస్ట్ యామినీ భాస్కర్

జూనియర్ ఎన్టీఆర్ హీరో గా ఆమధ్య విడుదలైన ‘రభస’ చిత్రంతో మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్న యామినీ భాస్కర్.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. కానీ ఆ తర్వాత ఆమె ఆశించినంత గుర్తింపు రాలేదు. దాంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సీజన్ 4కి రెడీ అవుతుంది.
తుపాకీ రాముడు బిత్తిరి సత్తి

బిత్తిరి సత్తి సైతం బిగ్ బాస్ సీజన్ 4లో రానున్నాడని తెలుస్తుంది. ఇందుకుగానూ ఆయనకు భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలిసింది.
టాప్ యాంకర్ రష్మి గౌతమ్

టాప్ యాంకర్ రష్మి గౌతమ్ కు భారీ మొత్తం ఇచ్చైనా సరే బిగ్ బాస్ 4 హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలలో వున్నారు షో నిర్వహాకులు. గతేడాది శ్రీముఖికి కోటి వరకు ఇచ్చి ఒప్పించినట్లే ఈసారి రష్మి విషయంలో జరుగుతుందని టాక్.
యాంకర్ రవి

తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ రవి త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4లోకి వస్తున్నాడని, ఇందుకు గానూ రవికి భారీ పారితోషికాన్ని ముట్ట జెప్పారనే ప్రచారం జోరుగా జరుగుతుంది.
యాంకర్ లాస్య

యాంకర్ లాస్య కూడా ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4షోకి వస్తుందనే ప్రచారం జరుగుతుంది.
యాంకర్ కమ్ సింగర్ మంగ్లీ

యాంకర్ కమ్ సింగర్ మంగ్లీ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ కు వస్తుందనే గాసిప్స్ వినబడుతున్నాయి. గతేడాది శివ జ్యోతిలా ఈ ఏడాది మంగ్లీని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట.
టాలీవుడ్ టాప్ సింగర్ సునీత

కల్పన, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ ఇలా ప్రతీ సీజన్‌లోనూ టాలీవుడ్ టాప్ సింగర్స్ ను ఎంపిక చేస్తున్నారు షో నిర్వాహకులు. ఈ సారి కూడా అదే పద్ధతిని ఫాలో అవుతూ ప్రముఖ టాలీవుడ్ టాప్ సింగర్ సునీతను ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
నందు

ప్రముఖ టాలీవుడ్ సింగర్ గీతా మాధురి భర్త నందుకు బిగ్ బాస్ సీజన్ 4 లో ఆఫర్ ఇచ్చినట్లుగా తెలిసింది.
బుల్లితెర నటుడు అఖిల్ సార్ధక్

తెలుగు సీరియల్స్‌లో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ సార్థక్ ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4 లిస్టులో కనిపిస్తున్నాడు.
వైవా హర్ష

గత 2 సీజన్స్‌లోనూ ఈయన పేరు బాగా వినిపించింది. యూ ట్యూబ్ లో సొంత ఫాలోయింగ్ బాగానే తెచ్చుకున్న వైవా హర్ష వైపు బిగ్ బాస్ నిర్వాహకుల చూపులు పడుతున్నాయి. గతేడాది మహేష్ అలాగే వచ్చాడన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ జాబితాలో వున్నవాళ్ళు ఎంత వరకు బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లోకి అడుగు పెడతారనే నిజం తెలియాలంటే స్టార్ మా అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.!



























