2003లో సుమంత్ హీరోగా వచ్చిన “సత్యం” చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినీ రంగానికి పరిచయమైన సూర్య కిరణ్… ఆ చిత్రం ద్వారా హీరో సుమంత్‌ని మాస్ హీరోగా నిలబెట్టడంతో పాటు దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అయితే అంతకంటే ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన సూర్యకిరణ్.. ఆ తర్వాత “సత్యం” చిత్రంతో రచయితగా, దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత సూర్యకిరణ్ డైరెక్ట్ చేసిన “ధన 51” చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడగా ఆ తర్వాత మంచు మనోజ్ హీరోగా తీసిన “రాజుభాయ్” చిత్రం ఓ మోస్తరుగా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత సూర్యకిరణ్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేకపోవడంతో ఆయనకు, చిత్ర పరిశ్రమకు మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అందుకే సూర్యకిరణ్ పేరు ఈ తరం ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని పేరైంది.

ఇక సూర్య కిరణ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సూర్యకిరణ్ మాజీ భార్య ఎవరో కాదు.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రముఖ హీరోయిన్ కల్యాణియే.! ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, పెదబాబు వంటి చిత్రాలతో తెలుగుప్రేక్షకులకి బాగా దగ్గరైన కల్యాణి.. సూర్యకిరణ్‌ని పెళ్లి చేసుకుంది. దురదృష్టకరమైన విషయమేమిటంటే.. పెళ్లి జరిగిన కొంతకాలానికే సూర్య కిరణ్, కళ్యాణి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత కళ్యాణి ఎప్పటిలాగే వచ్చిన సినిమా ఆఫర్లను ఒప్పుకుంటూ సినిమాలతో బిజీ అయిపొయింది. సూర్యకిరణ్ ప్రస్తుతం బిగ్ బాస్ 4 విజేతగా గెలవాలనే ధృడ సంకల్పంతో బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”కళ్యాణి తన జీవితంలో లేకపోవడం తీరని లోటేనని, కళ్యాణిని రోజూ మిస్ అవుతూనే ఉన్నా.. కళ్యాణి గారూ అంటే నా అమ్మ తరువాత అమ్మ. నాకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు వాళ్లను ఎలాగైతే భావిస్తానో కళ్యాణి గారు అన్నా అంతే గౌరవం. కళ్యాణి గారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. కళ్యాణి గారి కంటే అందంగా నాకు ఎవరూ కనిపించరు. తనకు నేను అవసరం లేదని అనిపించిందేమో.. నాకైతే ఆమె ఇప్పటికీ కావాలనే కోరుకుంటున్నాను. ఇప్పటికీ నా ఫోన్, ఐపాడ్‌లో అన్నీ కళ్యాణి గారి ఫొటోలే ఉంటాయి. ఆవిడ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు కాని.. కళ్యాణి గారూ నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ జన్మకి నా భార్య అంటే కళ్యాణి మాత్రమే’ అంటూ కన్నీటి పర్యంతమై భావోద్వేగానికి గురయ్యాడు సూర్య కిరణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here