బిగ్ బాస్ సీజన్ 5 లో విశ్వా ఎలిమినేషన్ ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హౌస్ మేట్స్ తో పాటు.. నెటిజన్లను కూడా షాక్ కు గురి చేసింది. అయితే వీడ్కోలు సమయంలో అతడు సూపర్ హీరోగా బయటకు వచ్చాడు. ఓటింగ్ లో తక్కువ శాతం ఓట్లు రావడంతో విశ్వా హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

అతడు అరియానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరి గురించి తన అభిప్రాయాలను తెలియజేశాడు. ఇక హౌస్ లో తన ఫేవరెట్ గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. శ్రీరామ చంద్ర ఫైటర్ అని అన్నాడు. అతడిని చూస్తే తన తమ్ముడు గుర్తుకువస్తాడు అంటూ చెప్పాడు.
మానస్ గురించి మాట్లాడుతూ.. విజయాన్ని ఎంజాయ్ చేసే అతడు.. ఓటిమిని కూడా అంగీ కరించాలన్నారు. హౌస్ లో గ్రూప్స్ ల వల్ల ఎవరైనా సేవ్ అయ్యారా.. వాటి వల్ల ఉపయోగం లేదన్నారు. యానీ మాస్టర్ స్ట్రాటజీ తనకు నచ్చదని.. ఆమె గేమ్ ను పక్కన పెట్టేసి.. వేరే వాళ్ల గేమ్ ను ఆపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అది తనకు నచ్చలేదన్నారు.
ఇక షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ.. అతడు గెలిస్తే ఒకలా.. ఓడితే ఒకలా ఉంటాడన్నారు. రెండింటినీ ఒకేలా తీసుకోవాలని అతడు చెప్పాడు. సిరి, షణ్ముఖ్ బయట స్నేహితులు కావచ్చు.. ఇక్కడ ఫ్రెండ్స్ కావచ్చు కానీ.. వేరెకరి జీవితంతో ఆడుకోవద్దంటూ హెచ్చరించాడు. పింకీ గురించి చెబుతూ.. మానస్ కు ఏమైనా దగ్గర ఉండి చూసుకునే ప్రియాంక.. ఆమె కిందపడితే మాత్రం అతడు వెళ్లలేదు. ఎందుకని అడిగితే తాను ఆమె దగ్గరకు పోను అంటూ చెప్పాడన్నారు.





























