బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అదీకూడా ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన కౌశల్ కి చాలా అవకాశాలు వస్తాయి అని ప్రేక్షకులు భావించారు.

కౌశల్ బిగ్ బాస్ షో లో వుండగానే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత కౌశల్ కు అందరూ ఊహించినట్టుగా అవకాశాలు రాలేదు. టీవీ ప్రోగ్రామ్స్ కు సంబంధించిన యాడ్స్ చేస్తూ బిజీ అయ్యాడు. అయితే ప్రస్తుతం కౌశల్ కు ఒకే ఒక్క సినిమా ఛాన్స్ వచ్చింది. పోలీస్ పాత్రలను కానీ, పవర్ ఫుల్ డైలాగ్స్ ను చెప్పడంలో కాని సాయి కుమార్ స్టైలే డిఫెరెంట్. ఆ సంగతి అందరికీ తెలిసిందే.! అయితే సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండటంతో, అందుకు చిత్ర యూనిట్ ఆ పాత్రకు మన కౌశల్ ను సెలెక్ట్ చేసినట్టు తాజా సమాచారం.

ఈ రోజు కౌశల్ పుట్టిన రోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. బైక్ మీద పోలీస్ డ్రెస్ తో కూర్చొని వున్న కౌశల్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఈ స్టిల్ ఫస్ట్ లుక్ పై కౌశల్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి జీబి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ షో తర్వాత అవకాల్లేక ఖాళీగా వుంటున్న కౌశల్ కెరీర్ రొట్టె విరిగి నేతిలో పడినట్టయ్యిందన్నమాట.!



























