Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణం వ్యక్తిలాగా బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టి అనంతరం సెలబ్రిటీగా మారినటువంటి పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో ఈయన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి విన్నర్ గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ ఆ డబ్బును తాను వాడుకోనని పేద రైతులకు పంచుతానని మాట ఇచ్చారు. అయితే ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి కూడా దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు పెద్దగా సహాయ కార్యక్రమాలు చేసిన సందర్భాలు మాత్రం కనిపించలేదు దీంతో ఈయన పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఈ విధంగా పల్లవి ప్రశాంత్ పట్ల విమర్శలు రావడంతో ఒక కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఏడాదికి సరిపడా బియ్యం కూడా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇకపై కూడా మరికొంతమంది రైతులకు తాను సహాయం చేస్తానని నేను చేసే సహాయానికి సంబంధించిన వీడియోలను అందరితో పంచుకుంటానని తెలిపారు.
డబ్బు పంచడం ఇష్టం లేదా..
ఇక ఈయన సహాయం చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పటివరకు మరో వీడియో షేర్ చేయలేదు. అయితే తాను పేద రైతులను గుర్తించి వారికి మాత్రమే సహాయం చేస్తానని తెలిపారు. ఇక తన ఇంటి వద్దకు ఎవరు కూడా సాయం చేయమని రావద్దని తానే పేదవారిని గుర్తించి సాయం చేస్తానని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఈయన పేదవారిని గుర్తించలేకపోతున్నారా లేకపోతే డబ్బు పంచడం ఈయనకు ఇష్టం లేదా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…