ఎక్కడో గుజరాత్‌లో పుట్టి సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయింది మోనాల్ గజ్జర్. అల్లరి నరేష్ సుడిగాడు సినిమాలో నటించి ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో హాట్ షోతో మతులు చెడగొట్టింది. ఇప్పుడు బిగ్ బాస్ 4లోకి అడుగు పెట్టింది మోనాల్. తాను చాలా ఎమోషనల్ అని చిన్న తనంలోనే తండ్రిని పోగొట్టుకోవడంతో బాగా ఎమోషన్ అవుతుంటాఅని.. బిగ్ బాస్ ద్వారా తనను తాను ప్రూవ్ చేసుకుంటానని హౌస్‌లోకి అడుగుపెట్టింది మొనాల్ గుజ్జర్. అయితే హౌస్‌లోకి గోవిందా గోవిందా అంటూ అడుగుపెట్టిన మొనాల్ గుజ్జర్..

తనకు తెలుగు రాదని ముందే చెప్పిన మొనాల్.. పొరపాటున కూడా ఒక్క తెలుగు మాట కూడా మాట్లాడకుండానే తెలుగు బిగ్ బాస్ ఆటకు రెడీ అయ్యింది. బిగ్ బాస్ సీజన్3లో సావిత్రి ఏడుస్తూ బుల్లితెర ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తే, సీజన్4లో నటి మోనాల్ గజ్జర్ సావిత్రిని ఫాలో అయినట్లు తాజా ఎపిసోడ్‌ని బట్టి అర్ధమైంది. స్టేజ్‌పైనే కన్నీళ్లు కార్చుకున్న ఈ అమ్మడు హౌజ్‌లోను తన కన్నీటి కుళాయి తిప్పుతూనే ఉంది. ఊరి విషయం గురించి మాట్లాడే అవకాశం తనకి దక్కగా, ఆ విషయాన్ని పక్కన పెట్టి తండ్రిని గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇది చూసి గంగవ్వ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తానికి మొదటి రోజే బిగ్ బాస్ హౌజ్ ఏడుపులు, పెడబొబ్బలతో రచ్చ రచ్చగా మారిందని చెప్పాలి.



























