బుల్లితెర పై ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకాభిమానం సంపాదించుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. గతంలో నాలుగు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం ఎంతో అంగరంగ వైభవంగా ఐదవ సీజన్ ను ప్రారంభించింది. గత రెండు సీజన్ల మాదిరిగానే ఐదవ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లకు నాగార్జున గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు.

అయితే ఈ హోస్ లో ఆరో కంటెస్టెంట్‌గా టెలివిజన్ నటుడు లోబో పాల్గొన్నారు.. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ నా కెరీర్ ప్రారంభమైన మాటీవీలో బిగ్ బాస్ షో లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షో పై ప్రశంశల వర్షం కురిపించాడు లోబో. అదలావుంటే గతంలో బిగ్ బాస్ షో పై లోబో వ్యాఖ్యానించిన విడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గతంలో నటుడు లోబో ఒక చానల్ కు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.., ‘బిగ్‌బాస్ షోపై మీ అభిప్రాయం ఏంటి.?’ అని యాంకర్ అడిగితే.. ‘నిజంగా బిగ్‌బాస్‌కు ఒక దండంరా అయ్యా. అది నా టేస్ట్ కాదు.. అసలు బిగ్‌బాస్‌లో అవకాశం రాకపోవమే మంచిది. నాకు ఆసలు ఆ షో నచ్చదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇలా మాట్లాడిన లోబో ప్రస్తుతం బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇవ్వడంతో పాత వీడియో ఒక్కసారిగా వైరల్‌గా అవుతుంది. దీంతో అప్పట్లో లోబో చేసిన వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. ఇంకెందుకు ఆలశ్యం వీడియోను మీరుకూడా చూసేయండి.
#Lobo ????#BiggBossTelugu5pic.twitter.com/htDetbYrY0
— Why that (@HeeZG0ne) September 6, 2021






























