Bindhu Madhavi : బిగ్ బాస్ రియాలిటీ షోలో హౌస్ లో కెమెరాల మధ్య ఇంటి సభ్యులు ఏంచేస్తున్నారో మనకు గంట చూపించేవారు. అయితే ఇపుడు నాన్ స్టాప్ ఓటీటీ అంటూ 24 గంటలు వాళ్ళు ఏంచేస్తున్నారో చూసే వెసులుబాటు ప్రేక్షకులకు కల్పిస్తున్నారు. దీంతో ఇంటి సభ్యులు ఏమి చేసినా తప్పించుకునే వీలు లేదు. 24 గంటలు టెలికాస్ట్ అవడంవల్ల ప్రేక్షకులకు దొరికిపోతారు. ఇక ఇపుడు ఇలానే బిగ్ బాస్ సీజన్ ఆరు నాన్ స్టాప్ ఓటీటీ విన్నర్ విషయంలో ఇలాంటి సందేహాలు మొదలయ్యాయి.

సిగరెట్ తాగావా… లేదా…..

మొదటిసారి ఒక అమ్మాయి బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంది. ఆడపులి అంటూ బిందు మాధవిని సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా చేసారు అభిమానులు. ఇక బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ గత శనివారం గ్రాండ్ గా జరిగింది. విన్నర్ గా బిందుకి గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. ఇక తాజాగా బిందు తన అభిమానులతో సోషల్ మీడియాలో లైవ్ చాట్ చేసింది. అందులో తనకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒక అభిమాని నువ్వు బిగ్ బాస్ హౌస్ లో సిగరెట్ తాగావా అని అడిగారు. దీనికి బిందు నేను అసలు స్మోక్ చేయను ఒకవేళ తాగాలనుకున్నా ఓపెన్ గానే చేస్తా కానీ దాచాల్సిన పని లేదు అని స్పష్టం చేసింది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో బిందు, అషు రెడ్డి బాత్రూం లో స్మోక్ చేసారనే టాక్ బాగా వినిపించింది. ఈ విషయంపై అషు ని అడిగినా తప్పించుకుంది. అయితే హౌస్ లో ఈ విషయాన్ని మొదట నటరాజ్ మాస్టర్ కనిపెట్టారు, కొంతమంది నైట్ టైమ్స్ బాత్ రూమ్ కి వెళ్లి స్మోక్ చేస్తున్నారని చెప్పాడు. ఇక స్రవంతి, అఖిల్ కి ఇంక తన ఫ్రెండ్స్ కి బిందు మాధవి స్మోక్ చేస్తోందని చెప్పింది. కెమెరాకు చిక్కకుండా స్మోక్ చేసారన్నది వాదన అయితే చేయలేదని బిందు స్పష్టం చేసింది. ఇక బిందు కోరుకున్న విధంగా తాను టైటిల్ గెలవడంతో పాటు తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు కూడా తెచ్చుకుంది.

































