Bithiri Sathi : సినిమా, టీవీ రంగంలో ఏల్లకేళ్లకు కష్టపడినా కొంతమందికి సక్సెస్ రాదు. అయితే కొంతమంది అవకాశం అందుకుని ఒక్క అవకాశంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు, ఆ ఒక్క అవకాశం వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. అలా ఒక్క వేషంతో బాగా ఫేమస్ అయి ఇపుడు కోట్లు ఖరీదు చేసే కార్లు కూడా కొనే రేంజ్ కి వెళ్ళాడు ఈ యాంకర్. ఆయన ఎవరో కాదు బిత్తిరి సత్తి. తెలంగాణ యాసలో అమాయకుడిలా మాట్లాడుతూ విశేషంగా అభిమానులను సంపాదించుకున్న బిత్తిరి సత్తి అటు టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఇటు సినిమా వాళ్లను ఇంటర్వ్యూ చేస్తుంటారు.

రేంజ్ రోవర్ తో షాక్ ఇచ్చిన బిత్తిరి సత్తి…
సినిమాల్లో అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగి అవమానాలు చూసిన బిత్తిరి సత్తి అసలు పేరు రవికుమార్. ఆయన సినిమాల్లో నటించాలన్న కోరికతో అవకాశాల కోసం వివిధ ఆఫీస్ ల చుట్టూ తిరిగిన అవమానాలే ఎదురయ్యాయి. ఇక బుల్లితెరను నమ్ముకుని మొదట నరసయ్య అనే ముసలి తాత వేషంతో ప్రోగ్రామ్ చేసి గుర్తింపు తెచ్చుకున్న రవికుమార్ ఆ తరువాత v6 లో వచ్చే తీన్మార్ న్యూస్ లో బిత్తిరి సత్తి గా వార్తలు చదివే యాంకర్ సావిత్రి కి జోడిగా ఇంట్రెస్టింగ్ గా న్యూస్ ని మార్చి అందరినీ ఆకట్టుకున్నానరు. ఇక బిత్తిరి సత్తి గా బాగా ఫేమస్ అయిపోయారు రవి కుమార్. నిజానికి అయన అసలు పేరు చాలా మందికి తెలియదు. కేవలం బిత్తిరి సత్తి అంటేనే తెలుసు. ఇక ఆయనకు ఇతర ఛానెల్స్ లో కూడా అవకాశాలు వచ్చాయి దాంతో పాటు సినిమా ఈవెంట్లు అలాగే సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం వంటి ప్రోగ్రామ్స్ చేసారు.

అలా బాగా ఫేమస్ అయిన రవి కుమార్ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఎవరైతే సినిమా అవకాశం కోసం వెళితే అవమానించి పంపారో వాళ్ళే మళ్ళీ సినిమాలో పాత్ర కోసం పిలిచేంత స్టేజి కి వెళ్లారు బిత్తిరి సత్తి. అలా తుపాకీ రాముడు అనే సినిమాలో కూడా నటించారు. ఇక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా బాగా సంపాదిస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్న బిత్తిరి సత్తి తాజాగా రెండున్నర కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారు కొని అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇక ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనకు అభిమనందనలు చెబుతున్నారు.




























