బిగ్ బాస్ సీజన్ 4లో బిత్తిరి సత్తి వున్నట్టా.. లేనట్టా.?

0
170

ప్రపంచంలో అత్యంత పాపులరైన బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో కూడా 1,2,3 సీజన్ లు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఇప్పుడు 4వ సీజన్ కోసం ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

సీజన్ 1 తో పోలిస్తే 3వ సీజన్ ముగిసేలోపు 3 రెట్లు వ్యూయర్ షిప్ పెంచుకున్న బిగ్ బాస్ 4వ సీజన్ లో కూడా అదే జోరు కొనసాగించే ఛాన్స్ వుంది. మామూలుగా జూన్, జూలైలో ప్రారంభం కావల్సిన బిగ్ బాస్ ఈసారి కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం లాక్ డౌన్ అన్ లాక్ కొనసాగుతుండడంతో షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ టీం జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. బిగ్‌ బాస్ 4ను ఈ సారి భారీగానే ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.  వ్యాఖ్యాతగా నాగార్జున తిరిగి కొనసాగుతారు. మొదట్లో 4వ సీజన్ కి నాగార్జున స్థానంలో మరో టాలీవుడ్ సెలెబ్రీటీ వస్తారనే రూమర్స్ వచ్చాయి. ఆ జాబితాలోకి విజయ్ దేవరకొండ పేరు, సమంత పేరు కూడా వినిపించింది. అయితే ఫైనల్ గా నాగార్జునయే సీజన్ 4 కూడా హోస్ట్ చేయబోతున్నాడని తెలిసింది. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఆర్య 2 సినిమాలో 2nd హీరోయిన్ గా నటించిన శ్రద్ధా దాస్ 4వ సీజన్లో కన్ఫామ్ అయ్యిందని సమాచారం. యాంకర్ లాస్య, లేక వర్షిణి వీళ్ళిద్దరిలో ఒకరు పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం బిగ్‌బాస్ 4లో ప్రముఖ యాంకర్ బిత్తిరి సత్తి కూడా పార్టిసిపేట్ చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గాసిప్స్ షికార్లు చేసాయి. టీవీ9ని నమ్ముకొని v6 ఛానల్ వదిలేసి వచ్చిన బిత్తిరి సత్తికి ఇక్కడికి వచ్చాక పరిస్థితులు తారుమారైన సంగతి తెలిసిందే. టీవీ 9 యాజమాన్యంతో ఓ ప్రోగ్రామ్ కారణంగా వచ్చిన విభేదాల మూలంగా బిత్తరి సత్తి Tv9 నుండి బయటకు వచ్చాడు. అదే టైంలో స్టార్ మా వాళ్లు మాస్‌ ఫాలోయింగ్ ఉన్న బిత్తిరి సత్తిని సంప్రదించారు. అంతేకాకుండా సత్తి బిగ్ బాస్ 4లో పార్టిసిపేట్ చేయడానకీ భారీ మొత్తంలో ఆఫర్ చేసారు. ఇక బిత్తిరి సత్తి కూడా బిగ్‌బాస్ 4లో వెళ్లడానికి రెడీ అయ్యాడు. తీరా అదే సమయానికి బిత్తిరి సత్తికి సాక్షి ఛానెల్ లో అవకాశం రావడంతో అందులోకి వెళ్లిపోయాడు. త్వరలోనే సాక్షి టీవీలో బిత్తిరి సత్తి సెటైరికల్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌కు సంబందించిన ప్రోమో కూడా విడుదలైంది.  ఈ నేపథ్యంలో ఈయన బిగ్‌బాస్ 4 లోకి వెళ్లే అవకాశం వుందో, లేదో అన్న విషయంపై చర్చలు జరుగుతూ ఉన్నప్పటికీ ఫైనల్ డిసిషన్ పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు లో సీజన్ 4 ప్రసారమయ్యేలా చేయడం కోసం బిగ్ బాస్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. మరి మిగతా 3 సీజన్ ల కన్నా ఈ 4వ సీజన్ ఎంతవరకూహిట్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here