BJP leader Bhargavi Kalyani : తెలంగాణలో ప్రస్తుతం బండి సంజయ్ అరెస్టు బాగా హీటెక్కిస్తున్న అంశం. ప్రధాని బీజేపీ నేత అయిన మోడీ తెలంగాణ పర్యటనకు రాబోతున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడం సంచలనం రేకెత్తించింది. 10వ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ హస్తం ఉంది అని వరంగల్ పోలీసు అధికారులు A1గా బండి సంజయ్ ను అరెస్టు చేశారు. ఇక అరెస్టు అయిన వెంటనే రోడ్లమీదకు బీజేపీ శ్రేణులు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఈ ఇష్యూ మీద బీజేపీ నేత భార్గవి కల్యాణి బిఅర్ఎస్ నేతల మీద ఫైర్ అయ్యారు.

కవిత ఇష్యూ డైవర్ట్ చేయడానికి బండి సంజయ్ అరెస్టు…
పదవ తరగతి పరీక్షల పేపర్ లీకేజిలో బండి సంజయ్ కి 11 తరువాత వాట్సాప్ లో విలేకరి ప్రశాంత్ ఫోటోలు పెడితే అది చూపించి బండి సంజయ్ ను A1గా అరెస్టు చేశారు. మరి అంతకుముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన పేపర్ లీకేజీకి మాత్రం 14 రోజుల గడువు తీసుకుని అరెస్టులు చేశారు. అప్పుడు కూడా కమిషనర్ ఆఫీస్ లో లీకేజీ వ్యవహారం నడిచినా కూడా కమిషనర్ కు విచారణ కానీ లేక సస్పెండ్ చేయడం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కానీ 9:30 కు పరీక్ష జరిగితే పదవ తరగతి పరీక్ష పేపర్ 11 గంటల పైన ఫోన్ కి పెట్టినందుకు అరెస్టు చేశారు. బండి సంజయ్ గారికి ఫోన్లో పేపర్ వచ్చే కంటే ముందు టీవీ9 వంటి వార్తా ప్రసార మాధ్యమాల్లో పరీక్ష పత్రం చూపించారు. కానీ బండి సంజయ్ ను అరెస్టు చేసారు ఇది కచ్చితంగా కవిత లిక్కర్ స్కామ్ కేసును మళ్లించడానికి అలాగే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మోడీ తెలంగాణ రాబోతున్న వేళ కావాలనే చేశారు. ఇప్పటికే బిఅర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత మరింత పెరుగుతుందనే ఇలా చేసారు అంటూ భార్గవి కల్యాణి ఆరోపించారు.





























