ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాల పాటు దీపాలు, కొవ్వోతులు, మొబైల్ ఫ్లాష్ లైట్లు, టార్చి లైట్లు వెలిగించి ప్రపంచానికి భారతదేశ ఐక్యతను చాటుదామని ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే కొందరు ముందస్తుగా దీపావళి అని పొరబడి టపాసులు కాల్చారు. అంతకంటే బిన్నంగా ఆలోచించి అత్యుత్సాహం ప్రదర్శించారు ఉత్తరప్రదేశ్ లోని బీజీపీ మహిళా నాయకురాలు.

వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లా బిజెపి పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మంజు తివారీ తన సహచరులతో కలిసి దీపాలను వెలిగించడానికి బదులుగా తుపాకితో గాలిలో కాల్పులు జరిపారు. అంతేకాదు ఈ తతంగం అంతా వీడియో తీసి మరీ షోషల్ మీడియాలో పెట్టారు. ప్రసుతం ఈ వీడియో సోషల్ మీడియాలో యమా వివారాలు అవుతుంది. అయితే ఈ బీజేపీ మహిళా నేత తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Video of BJP Mahila Ziladhyaksh Manju Tiwari from Balrampur firing in the air fs part of #9बजे9मिनट . Video uploaded from her own ID which went viral. #bjp #IndiaFightsCoronavirus @balrampurpolice pic.twitter.com/1PBPHMMA9G
— Amil Bhatnagar (@AmilwithanL) April 6, 2020




























