సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు అంటే తెల్లని రంగు గల సాధారణ ఉప్పును వివిధ రకాల వంటల్లో ఉపయోగించడం మనం చూస్తుంటాము. కానీ బ్లాక్ సాల్ట్ ఉపయోగించడం గురించి మనం వినే ఉంటాము.బ్లాక్ సాల్ట్ మనకు మార్కెట్లో లభించకపోవడం వల్ల ఈ ఉప్పు వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే బ్లాక్ సాల్ట్ ఎక్కువగా రంగు, రుచి, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో ఈ బ్లాక్ సాల్ట్ కి బాగా డిమాండ్ పెరుగుతోంది.
బ్లాక్ సాల్ట్ ఈ మధ్య కాలంలోనే కాకుండా పూర్వకాలంలో ఎన్నో ఆయుర్వేద ఔషధాలలో విరివిగా ఉపయోగించేవారు. బ్లాక్ సాల్ట్ లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ హిమాలయ బ్లాక్ ఎంతో ప్రసిద్ధి చెందినది.
పేరుకి ఇది బ్లాక్ సాల్ట్ అయినా నల్లగా కాకుండా, గులాబీ, గోధుమ రంగుల్లో ఉంటుంది.పూర్వం బ్లాక్ సాల్ట్‌లో మూలికలు, గింజలు, సుగంధ ద్రవ్యాల్ని కలిపి వేడి చేసేవారు. ఈ విధంగా తయారు చేసిన ఉప్పు ఎంతో సహజసిద్ధమైన బ్లాక్ సాల్ట్ గా చెప్పేవారు.
ప్రస్తుత కాలంలో కృత్రిమంగా కూడా ఈ బ్లాక్ సాల్ట్ ను తయారు చేస్తున్నారు. కొన్ని రకాల రసాయనాలను ఉపయోగించి ఈ బ్లాక్ సాల్ట్ ను తయారు చేస్తున్నారు.సాధారణ ఉప్పుతో పోలిస్తే బ్లాక్ సాల్ట్ లో తక్కువగా సోడియం ఉండటం వల్ల రక్తపోటు వంటి సమస్యతో బాధపడే వారు బ్లాక్ సాల్ట్ అధికంగా వాడటం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
సాధారణ ఉప్పులో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది.అయోడిన్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరం అయోడిన్ లోపం లేకుండా కాపాడుతుంది.బ్లాక్ సాల్ట్ లో అధిక భాగం మినరల్స్ ఖనిజాలు ఉండటం వల్ల ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్పడతాయి. కనుక ఈ రెండు రకాల సాల్ట్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. అయితే ఏ విధమైనటువంటి సాల్ట్ ను ఉపయోగించిన తక్కువ పరిమాణంలో ఉపయోగించినప్పుడు మాత్రమే ప్రయోజనాలను పొందవచ్చనీ నిపుణులు తెలియజేస్తున్నారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…