సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు అంటే తెల్లని రంగు గల సాధారణ ఉప్పును వివిధ రకాల వంటల్లో ఉపయోగించడం మనం చూస్తుంటాము. కానీ బ్లాక్ సాల్ట్ ఉపయోగించడం గురించి మనం వినే ఉంటాము.బ్లాక్ సాల్ట్ మనకు మార్కెట్లో లభించకపోవడం వల్ల ఈ ఉప్పు వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే బ్లాక్ సాల్ట్ ఎక్కువగా రంగు, రుచి, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో ఈ బ్లాక్ సాల్ట్ కి బాగా డిమాండ్ పెరుగుతోంది.

బ్లాక్ సాల్ట్ ఈ మధ్య కాలంలోనే కాకుండా పూర్వకాలంలో ఎన్నో ఆయుర్వేద ఔషధాలలో విరివిగా ఉపయోగించేవారు. బ్లాక్ సాల్ట్ లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ హిమాలయ బ్లాక్ ఎంతో ప్రసిద్ధి చెందినది.
పేరుకి ఇది బ్లాక్ సాల్ట్ అయినా నల్లగా కాకుండా, గులాబీ, గోధుమ రంగుల్లో ఉంటుంది.పూర్వం బ్లాక్ సాల్ట్‌లో మూలికలు, గింజలు, సుగంధ ద్రవ్యాల్ని కలిపి వేడి చేసేవారు. ఈ విధంగా తయారు చేసిన ఉప్పు ఎంతో సహజసిద్ధమైన బ్లాక్ సాల్ట్ గా చెప్పేవారు.

ప్రస్తుత కాలంలో కృత్రిమంగా కూడా ఈ బ్లాక్ సాల్ట్ ను తయారు చేస్తున్నారు. కొన్ని రకాల రసాయనాలను ఉపయోగించి ఈ బ్లాక్ సాల్ట్ ను తయారు చేస్తున్నారు.సాధారణ ఉప్పుతో పోలిస్తే బ్లాక్ సాల్ట్ లో తక్కువగా సోడియం ఉండటం వల్ల రక్తపోటు వంటి సమస్యతో బాధపడే వారు బ్లాక్ సాల్ట్ అధికంగా వాడటం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

సాధారణ ఉప్పులో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది.అయోడిన్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరం అయోడిన్ లోపం లేకుండా కాపాడుతుంది.బ్లాక్ సాల్ట్ లో అధిక భాగం మినరల్స్ ఖనిజాలు ఉండటం వల్ల ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్పడతాయి. కనుక ఈ రెండు రకాల సాల్ట్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. అయితే ఏ విధమైనటువంటి సాల్ట్ ను ఉపయోగించిన తక్కువ పరిమాణంలో ఉపయోగించినప్పుడు మాత్రమే ప్రయోజనాలను పొందవచ్చనీ నిపుణులు తెలియజేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here