ఓడినోడు సాధించలేనోడు బలవంతంగా ఉరేసుకుంటే అయ్యో పాపం అనుకుంటాం. జీవితంలో గెలుపు జెండా ఎగరవేసి చిన్నప్పుడే అన్ని సాధించేసి ఇలా అర్ధాంతరంగా అన్నీ వదలేసి వెళ్లిపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. టీవీ సీరియల్స్ లో అడుగు పెట్టాడు. సక్సెస్ స్టార్ అయ్యాడు. సహ నటి లోఖండేను ప్రేమించాడు. ఇద్దరూ ఆరేళ్ళు కలసి తిరిగారు. సరే, ఆ అమ్మాయి బ్రేక్ అప్ చెబితే “పాపం సుశాంత్” అనుకోవచ్చు. కానీ ఆలా జరగలేదు. సుశాంతే రిజెక్ట్ చేసాడు. సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత మొత్తం 12 సినిమాలో నటించాడు. ఒకటో రెండు మినహాయిస్తే మిగిలినవన్నీ సూపర్ హిట్లే.. డబ్బుకు కొదవ లేదు. పిల్లలకు నాసా చూపించాలని కొంతమంది ప్రభుత్వ స్కూల్స్ లో చదివే విద్యార్థులను తన సొంత ఖర్చులతో ప్రతి ఏటా 2 ట్రిప్ లు విజ్ఞాన యాత్ర చేయించాన్నాడు. బేసికల్ గా అతనికి ఆస్ట్రోనాట్ కావాలనేదే లక్ష్యం. కానీ, వీలుపడలేదు. మహిళలకు ఆత్మ విశ్వాసం నింపాలనే ఉద్దేశ్యంతో ఇన్ సృక్చర్స్ తో ఉచిత కరాటే శిక్షణా స్కూల్స్ నిర్వహించాడు.

మాజీ ప్రేయసితో అప్పుడప్పుడు చాట్ చేస్తుండేవాడు. తన ఇంట్లో ఒక గదిని పూర్తిగా స్పేస్ సెంటర్లా ఇష్టంగా మార్చేసుకున్నాడు. అయినా ఎక్కడో అశాంతి. అనాథ ఆశ్రమాలకు ప్రతి నెలా తన వంతు బాధ్యతగా కొంత ఆర్ధిక సాయం చేస్తూనే వుండేవాడు. అయినా ఏదో అలజడి మనసులో.. అక్క అంటే ఇష్టం. కానీ, పెళ్లి చేయక తప్పదు, చాలా గ్రాండ్ గా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. అయినా ఏదో లోటు. అమ్మ చనిపోయింది. ఒంటరై పోయాడు. అమ్మంటే అతనికి ప్రాణం. తట్టుకోలేకపోయాడు. సెలబ్రిటీ స్టేటస్ ఒక్కోసారి ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంత ఎక్కువగా బాధ పెడుతుంది. స్నేహితులతో కలవలేరు. నచ్చినట్లు షాపింగ్ చేయలేరు. ఎక్కడ పడితే అక్కడ తిరగలేరు. పానీపూరి బండి దగ్గర ఆగలేరు. అంతే ఒంటరి తనం. పోయిన అమ్మ తిరిగిరాదనే డిప్రెషన్. మేనేజర్ దిశ తన బాయ్ ఫ్రెండ్ తో వచ్చిన విభేదాలతో 14వ అంతస్థు నుంచి దూకి బలవాన్మరనానికి పాల్పడి వారమైంది. అదొక వెంటాడే చేదు విషాదం. ఇటు మాజీ ప్రేయసి లోఖండే వారం క్రితం ఆదిత్య అనే వ్యక్తితో రింగ్ మార్చుకుంది. లోఖండేను కావాలని వదులుకున్నా ఎక్కడో లోలోపల ఏదో తెలియని బాధ. ఉక్కిరి బిక్కిరి.. చెప్పుకోవడానికి ఎవరూ లేరు. పైగా లాక్ డౌన్. ఇంట్లోనే బందీగా వుండాల్సిన పరిస్థితి. ఆ బలహీన క్షణం.. ఆ ఆలోచించలేనితనం.. అంతే ఫ్యాన్ కు వేలాడి ప్రాణం విడిచేసాడు.!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలో ఉరి వేసుకుకున్నాడన్న వార్త వైరల్ గా మారి అందర్నీ షాక్ కి గురి చేసింది.. అయితే ఇంతవరకూ అతని బలవాన్మరనానికి గల కారణం మాత్రం స్పష్టంగా ఎవరికీ తెలియలేదు. ఇక తాజా అప్ డేట్స్ ప్రకారం అసలు సుశాంత్ చివరిగా ఎవరితో మాట్లాడాడనే విషయాన్ని ఎంక్వయిరీ చేయగా.. సుశాంత్ ఆదివారం ఉదయం 6:30 గంటలకు లేచి తన గదిలోనే ఉన్నాడు. ఉదయం 9:30 గంటలకు సుశాంత్ దానిమ్మ రసం తీసుకొని తన గదికి తాళం వేసుకున్నాడు. సుశాంత్‌ను అతని కుక్ చూడటం అదే చివరిసారి. ఉదయం 10:30 గంటలకు, వంట కోసం సుశాంత్ ను ఏం వండాలని
అడిగినా.. సుశాంత్ తలుపు తెరవలేదు. మధ్యాహ్నం 12 గంటలకు భోజనానికి రమ్మని పిలవడానికి కుక్ సుశాంత్ రూమ్ దగ్గరకు వెళ్ళాడు, ఈసారికూడా సుశాంత్ తలుపు తీయలేదు. చాలా సేపు తలుపులు కొట్టి సుశాంత్‌ని పిలిచిన కుక్ కి అనుమానం రావడంతో 12గంటల 15నిమిషాలకు సుశాంత్ సోదరికి ఫోన్ చేసి పిలిచి జరిగిందంతా చెప్పాడు. గోరేగావ్‌లో నివసిస్తున్న సుశాంత్ సోదరి విషయం తెలుసుకుని సుమారు 40 నిమిషాల్లో బాంద్రాకు చేరుకుంది. సోదరి వచ్చిన తర్వాత తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా.. సుశాంత్ శరీరం ఆకుపచ్చ కుర్తాకు వేలాడుతోంది. వెంటనే, కుర్తాలో కొంత భాగాన్ని కత్తితో కోసి సుశాంత్‌ను కిందకు దించారు. డాక్టర్ ని పిలిచి పోలీసులకు సమాచారం అందించారు.

ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ బృందం సుశాంత్ బెడ్ రూమ్ లో పోస్ట్ మార్టం చేసింది. పోలీసుల సమాచారం ప్రకారం.. సుశాంత్ సింగ్ గత 6 నెలలుగా ముంబైలోని ఒక ప్రముఖ మానసిక వైద్యుడి దగ్గర డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడు. ఇంట్లో అందుకు సంబంధించిన మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ కనిపించింది. పోలీస్ ఎంక్వయిరీ భాగంగా తన సోదరుడికి ఎటువంటి మానశిక సమస్య లేదని, ఆర్థికంగా ఇబ్బందుల్లేవని సుశాంత్ సోదరి పోలీసులకు తెలియజేసింది. ఇక సుశాంత్ చివరిసారిగా.. తన పాత స్నేహితుడు, టీవీ నటుడు మహేష్ కృష్ణ శెట్టితో చాలాకాలం తర్వాత మాట్లాడాడు. మహేష్ సుశాంత్‌తో కలిసి ‘ప్రీతా రిష్ట’ సీరియల్‌లో కలిసి నటించాడు. ఫోన్ కాల్ ఆధారంగా మహేష్ ని కలిసిన పోలీసులు మహేష్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.
ఏదేమైనా సుశాంత్ జీవన ప్రస్థానం నవతరానికి గొప్ప ఆదర్శం. అతని ముగింపు మాత్రం అభిమానులకు నిరాశను మిగిల్చిందనే చెప్పాలి.



























