Featured

కరోనా ఎఫెక్ట్ కు చలించిపోయి నర్స్ గా మారిన బాలీవుడ్ తార !!

Published

on

కష్టాలలో ఉన్నపుడే మనలో ఉన్న మనిషి బయటికొస్తాడంటారు. ఈ జీవిత సత్యాన్ని యధార్ధంగా నిరూపించించింది ఓ బాలీవుడ్ తార. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా డాక్టర్లు తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా జనం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక బాలీవుడ్ సినీ నటి.. తన వంతు బాధ్యతగా ప్రజా సేవ చేయడానికి నర్స్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ బాద్ షా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘ఫ్యాన్’ చిత్రంతో పాటు ఈమధ్య కాలంలోనే విడుదలైన వచ్చిన “కాంచలి“ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించిన శికా మల్హోత్రా ప్రస్తుతం ముంబైలోని ఓ హాస్పిటల్లో నర్సుగా మారి కరోనా బాధితులకు సేవలందిస్తూ తనలోని మానవత్వాన్ని చాటుకుంటుంది. భారత్ లో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రం మహారాష్ట్రయేనన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ డాక్టర్లు, నర్సుల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఈ దుస్థితిని గమనించిన షికా మల్హోత్రా వెంటనే స్పందించి తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంది. బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు ముందు ఢిల్లీలోని వర్ధమాన్ మహవీర్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ కోర్స్ లో డిగ్రీ చేసింది. కాబట్టి షికా మల్హోత్రాకు నర్సుగా సేవలందించే అర్హత ఉంది. ఇప్పుడు ఇలాంటి విపత్కార పరిస్థితుల్లో తన చదువుకు న్యాయం చేయాలని, దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుంది.

తాను చేసిన నర్సింగ్ కోర్స్ సమాజానికి ఉపయోగ పడాలనుకుని వెంటనే ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో తాను నర్స్ గా సేవలు అందించాలనుకుంటున్నట్లు తెలియజేసింది. శిఖా మల్హోత్రా నిర్ణయాన్ని అభినంధించిన హాస్పటల్ లోని డాక్టర్లు వెంటనే ఓకె చెప్పడంతో విధుల్లోకి చేరి నర్స్ గా సేవలందిస్తోంది ఈ అందాల తార. పేషెంట్ల సేవలో తలమునకలవుతున్న షికా మల్హోత్రా విరామం లేకుండా పని చేస్తున్న విధానం, ఆమె కమిట్మెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మనిషిగా అందరూ పుడతారు. కానీ మంచి మనిషిగా కొందరే జీవించగలరని నిరూపించిన శిఖా మల్హోత్రా కు మనస్ఫూర్తిగా హాట్సాఫ్ చెబుతుంది ముంబై నగరం.

Advertisement

Trending

Exit mobile version