బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్ మరోసారి అలియా భట్ పై రెచ్చి పోయారు. తాజాగా ఆమె మరో నటి విరుచుకు పడ్డారు. తాజాగా, ఆమె ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..

“గతంలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రానికిగానూ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకుణెకు అవార్డు వచ్చింది. కానీ ఆమెకన్నా ‘క్వీన్’ చిత్రంలో నా నటన బాగుందన్న విషయాన్ని ఆమె స్వయంగా అంగీకరించడమే కాకుండా తనకొచ్చిన అవార్డును కూడా తిరస్కరించింది. ఆ విషయం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నిజమైన హీరోయిన్ అంటే ఇలాగే వుండాలని నిరూపించిన దీపికాను చూసి తోటి నటిగా గర్వ పడ్డాను కానీ ఈమధ్య “గల్లీబాయ్” చిత్రంలో అలియా భట్ కేవలం 10 నిమిషాలు నటించినందుకు గానూ తనకు అవార్డు వస్తే కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆ అవార్డును అందుకుంది.

ఈమధ్య కాలంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ‘చిచోరే’ సినిమాకు కనీసం ప్రశంసలు కూడా రాలేదు.’ అంటూ తనదైన శైలిలో అలియా భట్ కు చురకలు అంటించింది. ఈ సందర్భంగా అవార్డు ఫంక్షన్ లలో కొందరు నటీనటులకు అవమానం జరుగుతుందని, కొందరు మాత్రం అర్హత లేకపోయినా సిగ్గు లేకుండా అవార్డులు తీసుకుంటున్నారని ఘాటుగానే విమర్శించింది కంగనా. కంగనా అంతలా రెచ్చిపోతుంటే.. ఆలియా భట్ మాత్రం కంగనాపై తనకెలాంటి కోపం లేదంటోంది. పైగా కంగనా లాగ మనసులో ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా పైకి చెప్పడం తన వల్ల కాదని అందుకే తనంటే గౌరవం అని పాజిటివ్ గానే బదులిచ్చింది. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడానికి కారణమేమిటబ్భా.? అని ఆరా తీస్తే..

ఆమధ్య విడుదలైన “మణికర్ణిక” చిత్రం షూటింగ్ టైంలోనే.. కంగనా, ఆలియా భట్ ల మధ్య విభేదాలొచ్చాయని. “మణికర్ణిక” డైరెక్టర్ విషయంలో వీళ్ళిద్దరికీ అభిప్రాయ భేధాలొచ్చినప్పుడు.. ఆలియా భట్ తనకి సపోర్టింగ్ గా మాట్లాడలేదని.. ఆ సంఘటనని కంగనా మనసులో పెట్టుకుంది కాబట్టే అప్పటి నుంచి ఆలియా భట్ ని టార్గెట్ చేస్తూనే ఉందని తెలిసింది. ఆడదానికి ఆడదే శత్రువని పెద్దలందుకే అన్నారేమో.!




























