సెలబ్రిటీల వివాహ బంధాల గురించి తెలుసుకోవడం ప్రజలకు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. సెలబ్రిటీల గురించి వైరల్ అయ్యే వార్తల్లో కొన్ని వాస్తవాలు కాగా మరికొన్ని మాత్రం గాసిప్స్ ఉంటాయి. అయితే మనలో చాలామంది సెలబ్రిటీల జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు ఉండవని భావిస్తూ అవే అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ వాస్తవాలు మాత్రం మరో విధంగా ఉంటాయి. చాలా మంది సెలబ్రిటీల జీవితాల్లో సంతోషం కంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి.

గత మూడు రోజులుగా పూనమ్ పాండే భర్తతో గొడవ పడి కేసు పెట్టిన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. పెళ్లైన పది రోజులకే భర్తపై కేసు పెట్టడమేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే పూనమ్ భర్తపై కేసు పెట్టడం వెనుక అసలు కారణాలు తెలిస్తే ఆమె పడిన నరకయాతన సులభంగా అర్థమవుతుంది. పూనమ్ కేసు పెట్టిన తరువాత ఆమె భర్త సామ్ జైలు నుంచి విడుదలయ్యాడు.
పోలీసులో గోవాల్లో అతన్ని అరెస్ట్ చేయగా ఆమె అక్కడేం జరిగిందో పూస గుచ్చినట్టు వెల్లడించింది. పూనమ్ తన భర్తతో కలిసి గోవాకు వెళ్లిన సమయంలో ఒక చిన్న విషయంలో ఇద్దరి మధ్య కొంత సమయం పాటు వాదులాట చోటు చేసుకుందని తెలిపింది. తన జుట్టును లాగి తలపై కొట్టాడని… శ్వాస ఆడకుండా ఇబ్బందులు పడేలా చేశాడని… తన ముఖంపై దాడి చేశాడని పేర్కొంది.
శరీరంపై మోకాళ్ల మీద కూర్చుని చిత్రహింసలకు గురి చేశాడని వెల్లడించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పూనమ్ పోలీసులను ఆశ్రయించింది. సామ్ తో తనకు మూడు సంవత్సరాలుగా సంబంధం ఉందని అతను గతంలో తప్పుగా ప్రవర్తించినా భరించానని.. అతనిలో మార్పు వస్తుందని భావించినా ఆ విధంగా జరగలేదని పేర్కొన్నారు. దీంతో వైవాహిక బంధాన్ని ముగించి ఒంటరిగా జీవించాలని పూనమ్ భావిస్తోంది.

































