బాలీవుడ్ లో నెబర్ 1 హీరోయిన్ గా ఎదిగిన కత్రినా కైఫ్ తొలిసారిగా “మల్లీశ్వరి” చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మీర్జాపూర్ యువరాణి మల్లీశ్వరి పాత్రలో కత్రినా కైఫ్ చాలా అందంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులను కబ్జా చేసిందనే చెప్పవచ్చు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన “అల్లరి పిడుగు” చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ టైంలో కత్రినా కైఫ్ దిగిన ఓ ఫోటోను ఈమధ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో బాగా వైరలవుతుంది.

ఈ సందర్భంగా కత్రినా కైఫ్ తానెంత గొప్ప స్ధాయిలో వున్నా సరే తెలుగు సినిమాలను ఎప్పటికీ మర్చిపోలేనని, టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన క్రొత్తలో తాను నటిస్తున్న సినిమాల్లోని పాటలకు డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానని, చాలా మంది తను పడుతున్న ఇబ్బందిని చూసి గొల్లున నవ్వేవారని.. కానీ బాలకృష్ణ మాత్రం తన అవస్ధని అర్థం చేసుకొని పాటలకు డాన్స్ ఎలా చేయాలో మెళకువలు నేర్పించారని, ఆ తర్వాత తను నటించిన సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడలేదని, బాలకృష్ణ చెప్పిన అన్ని మెళకువలను శ్రద్ధగా పాటిస్తూ తనతో కలసి నటించిన సినిమాల్లో బెస్ట్ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశానని కత్రినాకైఫ్ తెలియజేసింది. ఇప్పటికీ తన సినిమాల్లో బాలకృష్ణ చెప్పిన డాన్స్ టెక్నిక్ లను గుర్తు చేసుకుంటూ డాన్స్ వేస్తానని, అందుకే బాలకృష్ణ తనకు డాన్స్ గురువు అని తెలియజేయడంతో లెజెండ్ బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.




























