బాలీవుడ్ లో సంవత్సరానికి కనీసం 3, 4 సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అగ్ర హీరో అక్షయ్ కుమార్. లేటెస్టుగా ఆయన నటించిన హారర్ & కామెడీ చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ కోసం అక్షయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని మే 22నే విడుదల చేయాలనుకున్నారు.

కానీ., కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా విడుదల చేయడం సాధ్యపడలేదు. చివరకు చిత్ర నిర్మాతలు ప్రేక్షకులను అలరించడానికి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫాంపై విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం ప్రముఖ డాన్సర్, & డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ క్రింద సుమారు 125 కోట్ల రేటు దక్కించుకుందని బాలీవుడ్ సమాచారం. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ సినిమా బడ్జెట్ మొత్తం మీద 40 కోట్లు కూడా కాలేదంట. కానీ స్ట్రీమింగ్ రైట్స్ కింద 125 కోట్లు సాధించిన సినిమా శాటిలైట్ రైట్స్ & మ్యూజిక్ రైట్స్ రెండూ కలిపి మరో 100 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ బిజినెస్ 225 కోట్లు అయిందని తెలిసింది.

ఇక ఈ కలెక్షన్స్ లో నుండి హీరో రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉండగా ముందు నుండి శాటిలైట్ రైట్స్ ని రెమ్యునరేషన్ కింద అలాగే సినిమా టోటల్ లాభాల్లో వాట తీసుకునే అక్షయ్ కుమార్ ఈజీగా 80 నుండి 90 కోట్లు రెమ్యునరేషన్ కింద తీసుకునేవాడు కాగా ఈసారి కూడా సినిమా శాటిలైట్ & మ్యూజిక్ రైట్స్ రెండూ కలిపి తన రెమ్యునరేషన్ కింద తీసుకున్నాడని బాలీవుడ్ లో రూమర్స్ వినబడుతున్నాయి. ఈ లెక్కన అక్షయ్ అక్షరాలా 100 కోట్ల రెమ్యునరేషన్ ని దక్కించుకున్నాడని సమాచారం. ఇప్పుడు ఓవరాల్ గా 40 కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాత కి 100 కోట్లు అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ తీసేసినా మరో 85 కోట్లు ప్రాఫిట్ అనే చెప్పాలి. దాంతో అందరూ భారీ ప్రాఫిట్స్ తోనే ఇప్పుడీ సినిమాను డిజిటల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. లక్ష్మీ బాంబ్ బాగా పేలింది కదూ.!



























