బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత సుశాంత్ కు సంబంధించిన అనేక కీలక విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా అయన గురించి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అభిషేక్ కపూర్ ఒక కీలక విషయాన్ని బయటపెట్టారు. ఒక సమయంలో సుశాంత్ 50 నంబర్లు మార్చారని ఆయన చెప్పారు. సుశాంత్ ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడే అభిషేక్ కపూర్. ‘కాయ్ పో చే’ అనే చిత్రానిలో సుశాంత్ ను హీరోగా బాలీవుడ్ కి పరిచయ చేసాడు అభిషేక్ కపూర్.. ‘కేదారినాథ్’ అనే చిత్రం కూడా అతనితోనే తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమా విడుదలైన తరువాత సుశాంత్ 50 ఫోన్ నంబర్లను మార్చారట. ”ఆ సమయంలో మీడియా కూడా అతడిని పక్కకు తోసేసింది. ఆ సమయంలో అందరూ సారా అలీఖాన్ మీదే ఫోకస్ చేసారు.. ఆమె గురించే మాట్లాడేవారు. ఈ క్రమంలో సుశాంత్ చాలా ఇబ్బంది పడ్డాడు. నాతో కూడా సుశాంత్ మాట్లాడలేదు. ఏదో పోగొట్టుకున్నట్లు అయిపోయాడు” అని చెప్పాడు అభిషేక్ కపూర్. అయితే హిందీ చిత్ర పరిశ్రమలో నెపోజిటం ఎక్కువగా ఉండటమే సుశాంత్ మరణానికి కారణం, సుశాంత్ కు న్యాయం చేయాలంటూ సుశాంత్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.




























