అను అగర్వాల్… ఒకప్పుడు ఈమె బాలీవుడ్లో తిరుగులేని రారాణిగా ప్రఖ్యాతి చెందింది. ఆషీకీ ఈ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆమె మొదటి సినిమాతోనే బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశంలోని ప్రతి సినిమా ప్రేక్షకులకి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. అను అగర్వాల్ జనవరి 11, 1969 న ఈవిడ జన్మించారు. ఈవిడ 1990 సంవత్సరంలో ఆషీకీ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఆ సినిమా 2 సంగతులను మనకు ఇచ్చింది. అందులో మొదటిది ఎప్పుడు మరిచిపోలేని పాటలు, మరొకరు హీరోయిన్ అను అగర్వాల్. అయితే ఈ సినిమా చేయకముందు అను అగర్వాల్ తను అసలు ఎప్పుడూ హీరోయిన్ కావాలని అని అనుకోలేదు. అయితే దర్శకుడు మహేష్ భట్ ప్రోత్సాహంతోనే ఆవిడ సినీ పరిశ్రమలోకి వచ్చింది. ఆషీకీ సినిమాను ముందుగా తనకు వివరించిన తను ఒప్పుకోలేదు. కాకపోతే ఏడు నెలల తర్వాత మళ్లీ మహేష్ భట్ అను అగర్వాల్ కు ఫోన్ చేసి నువ్వు ఈ సినిమా చేయకపోతే నేను ఈ సినిమా తీయను అని చెప్పడంతో ఆమె ఆ సినిమాల్లో నటించింది.

అయితే ప్రస్తుతం ఈవిడ ఎక్కడ ఉంది ఏం చేస్తున్నారు అన్న సంగతి విషయానికొస్తే…. నిజానికి ఈమె జీవితం అచ్చం సినిమా స్టోరీలా ఉంటుంది. మొదటగా ఈవిడ జన్మించింది ఢిల్లీలో. కానీ తల్లిదండ్రుల కారణంగా ఆవిడ చెన్నైలో కొద్ది రోజులు ఉండగా మళ్ళీ తిరిగి ఢిల్లీలో సోషియాలజీ సబ్జెక్టులో డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ సమయంలోనే ఆవిడ మంచి అందగత్తె అవడంతో స్వతహాగా సినీ ఇండస్ట్రీలోకి లేదా మోడలింగ్ లో వెళితే తన భవిష్యత్తు బాగుంటుందని అప్పట్లో తన స్నేహితులు ఆమెకు తెలియజేశారు. దీనితో ఆవిడకు ముందుగా సినిమాలు చేయడానికి ఇష్టం లేకున్నా మోడలింగ్ చేద్దామని తను ముంబైకి వచ్చింది. ఆ తరుణంలో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు మోడల్ గా పని కూడా పని చేసింది. 1988వ సంవత్సరంలో దూరదర్శన్ ఛానల్లో వీడియో జాకీగా ఆకట్టుకుంది. అప్పట్లో ఆమె అభినయం అందం చూసి వద్దు వద్దు అన్న గాని సినిమా ఆఫర్లు ఆమెకు వెంటనే వచ్చాయి. ఇక ఇదే తరుణంలో 1990 సంవత్సరంలో మహేష్ బాబు నిర్మించిన ఆశిక్ ఈ సినిమా ద్వారా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టింది. అయితే ఆ సినిమా తర్వాత ఇక ప్రతి డైరెక్టర్ ఆమెతో సినిమా తీయాలని బారులుతీరారు. కానీ అవన్నీ ఆమె పక్కన పెట్టి వరల్డ్ టూర్ వెళ్లి వచ్చాక మంచి పాత్రలు ఉన్న సినిమాలు చేయాలని భావించి వాళ్ళు టూర్ కి వెళ్ళిపోయింది. అలా వెళ్లొచ్చాక ఆవిడ డేట్స్ ఇస్తే చాలు అన్నట్లుగా ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్ధమైపోయారు.

ఇలా అనేక సినిమాల్లో ఆమెకు ఛాన్స్ వచ్చినా కేవలం తనకు నచ్చిన సినిమాలోనే ఎంచుకొని సంవత్సరానికి ఒక సినిమా లాగే సినిమాలు చేస్తూ వచ్చారు. అలాగే 1993వ సంవత్సరంలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం తో తమిళంలో తిరుధ తిరుధా అనే సినిమా, అదేనండి మన తెలుగు లో దొంగ దొంగ సినిమా పేరుతో వచ్చిన సినిమాని అప్పుడు ఆమె అంగీకరించింది. ఆ సినిమాలోని కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి అన్న పాట ఇప్పటికీ మనకు సుపరిచితమే. అయితే ఇక 1994వ సంవత్సరంలో మన తెలుగు డైరెక్టర్ అయినా మణి కౌల్ అనే దర్శకుడు ది క్లౌడ్ డోర్ అనే ఇండో-జర్మన్ సినిమాని తీశారు. ఇక ఆ సినిమాలో అను అగర్వాల్ పూర్తిగా న్యూడ్ గా నటించింది. అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ గా కూడా మారింది. దీనితో ఆ సినిమా మా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా కేన్స్ చిత్రోత్సవాల్లో కూడా ఆ సినిమాను ప్రదర్శించడం జరిగింది.

అలా కొద్దిగా సినిమాలు చేస్తూ చేస్తూ ఆమెకు సినిమా అంటేనే కాస్త బోర్ కొట్టడంతో అలా కొన్ని రోజులు హిమాలయాలకు వెళ్లి తిరిగి వచ్చి మళ్ళీ సినిమాలు చేద్దాం అనుకుని ఉన్న రోజుల్లో ఆమెకు ముంబైలో అనుకోని విధంగా భారీ యాక్సిడెంట్ జరిగింది. ఇక ఆ ఆక్సిడెంట్ లో అను అగర్వాల్ పూర్తిగా దెబ్బలు తగిలి కోమాలోకి వెళ్లి పోయింది. ఇక శరీరంలో మొత్తం ఇరవై తొమ్మిది చోట్ల ఎముకలు విరిగి అయితే ఆమె పరిస్థితి అర్థం చేసుకోండి. అనేక శస్త్రచికిత్సలు, అనేక మంది డాక్టర్ల నిపుణుల సూచనల మేరకు ఆరు సంవత్సరాల తర్వాత ఆమె కోలుకోవడం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన ఆరు నెలల వరకు ఆమె కోమాలోనే ఉండిపోయింది. కోమాలో నుంచి బయటికి వచ్చిన ఆమె ముఖం ఆమె చూసుకోవడానికి చాలా భయపడింది. అలాంటి సంఘటన నుంచి బయటికి తేరుకొని చూడగానే ఆమెకు పూర్తిగా తన గతాన్ని మర్చి పోయింది.

ఆరు సంవత్సరాలు గడిచిన తరువాత ఆమెకు తన గతాన్ని గుర్తుకు వచ్చింది. ఆ ఆరు సంవత్సరాల్లో ఆమె నరకం భూమి మీద ఉండగానే చూసిందని అని చెప్పవచ్చు. తన కుడిచేయి పని చేయకపోవడంతో ఆవిడ పనులన్నీ ఎడమ చేతితోనే చేసుకునేది. ఆ తర్వాత యోగతో తన ఒత్తిడిని పూర్తిగా తొలగించుకుంది. ఇక ఆమె తన శరీరంతో పెద్ద యుద్ధమే చేసిందని చెప్పవచ్చు. అనూ ఫన్ అని యోగ పేరుతో సొంతంగా ఒక హీలింగ్ పద్ధతిని తయారుచేసింది. ఆ తరువాత వైద్యుల సహకారంతో పూర్తి మనిషి అయింది ఆవిడ. యోగ, తాంత్రిక సెక్స్ తనను మాములు మనిషిని చేసిందని తన తర్వాత రచించిన ఆత్మకథలో వివరంగా చెప్పింది. ఇక ఆ తరువాత ముంబైలోని కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలను, పిల్లలను పలకరిస్తూ వారికి యోగా, జీవితం పట్ల సూచనలు ఇస్తుంది. ఇలా ఆవిడ ప్రస్తుత జీవితం ముంబైలో కొనసాగిస్తుంది. అయితే ఇంతకు ముందు సినిమాలు చేసిన ఆమెతో వారు ఇప్పుడు ఆమెను చూస్తే అసలు గుర్తు పట్టలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here