అర్జున్ కపూర్ నాకన్నా 11 ఏళ్ళు చిన్నవాడైనా డేటింగ్ లో చాలా గట్టివాడే.. సంచలన వ్యాఖ్యలు చేసిన మలైకా!

0
325

బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ వెండితెరపై చాలా హాట్ గా వుంటుందన్న సంగతి తెలిసిందే. కానీ రియల్ లైఫ్ లో కూడా డేటింగ్ పేరుతో వీళ్ళు నడిపే ప్రేమ వ్యవహారాలు ఇంకా హాట్ హాట్ గా వుంటాయని మలైకా అరోరా మరోసారి నిరూపించింది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్భజ్ ఖాన్‌ను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న మలైకా తన
20 ఏళ్ళ దాంపత్య జీవితం తరువాత అర్బాజ్ ఖాన్ తో విడిపోయి గత కొంతకాలంగా కుర్ర హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేయడం మొదలు పెట్టింది. ఈ మధ్య వీరు ఎక్కడికి వెళ్ళాలన్న చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. దీంతో వీరి మధ్య బంధం రోజురోజుకీ బలపడుతుందనుకుంటుండగా ఎవ్వరూ ఊహించని విధంగా మలైకా- అర్జున్ కపూర్ మధ్య డేటింగ్ కి బ్రేక్ పడిందని.. మలైకా, అర్జున్ కి బ్రేకప్ చెప్పేసిందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇదే విషయాన్ని బాలీవుడ్ బ్యూటీ మలైకా వద్ద ప్రస్తావించగా అర్జున్ కపూర్ డేటింగ్ పై స్పందించింది మలైకా.

“తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన కొన్ని విషయాలకు తాను స్పందించనని, తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేందుకు తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని, తన లైఫ్ కు సంబంధించిన అన్ని విషయాలు అందరికీ తెలుసునని‌, ప్రస్తుతానికైతే తన లైఫ్ ని తాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానని… తన జీవితం ఎంతో హ్యాపీగా ఉందని చెబుతూనే.. అర్జున్ తనకంటే 11 ఏళ్ళు చిన్నవాడైనా డేటింగ్ విషయంలో చాలా గట్టివాడంటూ ఓ బాంబ్ పేల్చేసింది. మలైకా ఒక్కసారిగా ఇలా బాంబ్ పేల్చడంతో సోషల్ మీడియాలో మలైకా కామెంట్స్ చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఇదిలావుండగా మరోవైపు అర్జున్ కపూర్.. మలైకాల పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అర్జున్ కపూర్ తాను పెళ్లి చేసుకోడానికి ఇంకా చాలా టైమ్ ఉందంటూ ఆ టాపిక్ ను మాత్రం దాటేస్తుండడం వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం లోని అసలైన ట్వీస్ట్ గా చెప్పవచ్చు. దీంతో వీళ్ళిద్దరిద్దరు డేటింగ్ ట్రాక్ రోజురోజుకూ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

అదండి సంగతి.. మొత్తానికి బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఇద్దరు పిల్లల తల్లైనా తనకంటే 11 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ లాంటి యువ హీరోను ప్రేమించి డేటింగ్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here