యువనటుడు సుశాంత్ కేసులో ప్రకంపనలు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. మరోవైపు తనతో పెట్టుకుంటే ఎవరికైనా సరే చుక్కలు చూపిస్తానంటూ.. బాలీవుడ్ లోని నెపోటిజంపై నటి కంగనా రనౌత్ తన పోరాటం కొనసాగిస్తూనే వుంది.

ఆ పోరాటంలో భాగంగా ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టింగ్ గా వుంటున్న కంగనా ఛాన్స్ దొరికితే చాలు తనకి నచ్చనివాళ్ళపై మాటల తూటాలు పేలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో సగం మంది స్టార్స్ తో ఈమెకు సరైన రిలేషన్ లేదనే గాసిప్స్ వినబడుతున్నాయి.. సుశాంత్ సింగ్ మరణం తర్వాత నెపోటిజంపై కంగనా ఘాటుగానే స్పందించిన కంగనా బాలీవుడ్ ప్రముఖులందరిని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా మరోసారి..

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణేని టార్గెట్ చేసింది. పనిలో పనిగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని కూడా ఏకిపారేసింది. “స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఒక సైకో, యంగ్ హీరో రణబీర్ కపూర్ ఒక రేపిస్ట్” అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ‘ప్రతిరోజు అమ్మాయిల వెంటపడే రణబీర్ ను ఎవరూ రేపిస్ట్ అని పిలవరని, తనను తాను ఓ మానశిక రోగిగా దీపిక ప్రకటించుకుందని.. అయినప్పటికీ ఆమెను ఎవరూ సైకో, రాక్షసి అని పిలవరని, సామాన్య కుటుంబాల నుంచి, చిన్న చిన్న పట్టణాల నుంచి సినిమా ఇండ్రస్ట్రీలోకి వచ్చినవాళ్ళకి మాత్రమే ఇలాంటి పేర్లు పెడతారని కంగనా మండిపడింది.



























