బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసు దర్యాప్తులో CBI ఎంటరైన దగ్గర్నుంచి రోజుకో క్రొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా సుశాంత్ కేసులో మొదటి నుంచి విమర్శలు ను ఎదుర్కొంటున్న అలియా భట్ తండ్రి మహేష్ భట్ రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.సుశాంత్ కేసులో ప్రధాన దోషిగా ఉన్న రియా చక్రవర్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు కొన్ని అనుమానాలకు దారి తీశాయి. గతంలో మరణించిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ తో కూడా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ చాల క్లోజ్ గా ఉన్న ఫోటోలు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. సుశాంత్ మరణం వెనుక రియాతో కలిసి మహేష్ భట్ కుట్రలు చేశారనే విమర్శలొస్తున్న క్రమంలో ఈ టాప్ డైరెక్టర్ శృంగార లీలలను నెటిజన్లు బయట పెడుతున్నారు. సుశాంత్ మరణం తర్వాత ఎక్కువగా విమర్శలను ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో మహేష్ భట్ ఒకరు. రియాతో కలిసి కుట్ర పన్నారనే కామెంట్స్ బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి.

సుశాంత్ మరణం తర్వాత మహేష్ భట్‌తో పాటు మరికొందరు బాలీవుడ్‌లో వీరే కారణం అంటూ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాదస్పదమైన కామెంట్స్ చేయడం మరింత సెన్సేషన్‌గా మారింది. రియాతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే సుశాంత్ మరణంలో అనేక అనుమానాలు, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మహేష్ భట్ ప్రవర్తనపై గతంలో కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉలిక్కి పడేలా చేశాయి. కంగనా సెన్సేషనల్ కామెంట్స్ తర్వాత మహేష్ భట్‌ను ముంబై పోలీసులు హడావిడిగా విచారించారు. అయితే మహేష్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించడం కంటితుడుపు చర్యే అనే మరో విమర్శ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. మహేష్ భట్‌పై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తున్న తరుణంలోనే మరో పక్క రియాతో చేసిన సీక్రెట్ ఛాటింగ్ మీడియాలో బయటకు వచ్చింది. దాంతో సుశాంత్ కేసులో మహేష్ భట్, రియా పాత్రలపై మరింత సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ కూడా విచారించే అవకాశాలు లేకపోలేవనే వాదన కూడా వినిపిస్తున్నది.

సుశాంత్ కేసులో కొన్ని సందేహాలు నెటిజన్లందరి మనసులలో రేకేత్తుతున్నప్పుడు, సీబీఐ దర్యాప్తు చేస్తున్న టైంలోనే గతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన జియాఖాన్‌తో మహేష్ భట్ క్లోజ్ గా ఉన్న వీడియో సోషల్ మీడియాలో కనిపించే సరికి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగబోతుందోనన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో కనిపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ కు అప్పుడు 16 ఏళ్లు మాత్రమే వుండటం విశేషం. ఈ వీడియోలో జియాఖాన్‌ను ఒడిలో పెట్టుకున్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మహేష్ భట్ ఆమెతో క్లోజ్ గా వ్యవహరించడం కనిపించింది. జియా ఖాన్ విషయానికి వస్తే.. రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘నిశ్శబ్ద్’ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించింది. 2007లో వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి జియా ఖాన్ నటించింది. ఆ తర్వాత 2013 జూన్ 3 తేదీన జియా ఖాన్ అనుమానాస్పద పరిస్థితుల్లో ముంబైలోని ఓ ఫ్లాట్‌లో మరణించింది. ఈ కేసులో సూరజ్ పంచోలిపై కేసు నమోదైంది. సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలి తన పలుకుబడితో కేసును నీరుగార్చారని జియా ఖాన్ ఫ్యామిలీ, జియా ఫ్యాన్స్ ఇప్పటికీ కామెంట్స్ చేస్తుండటం సుశాంత్ కేసులో ఊహించని ట్విస్ట్ గా చెప్పవచ్చు.



























