భన్సాలీ సినిమాల నుంచి సుశాంత్ ను తప్పించమని ఎవరైనా చెప్పారా.? లేక నిజంగానే సుశాంత్…

0
211

బాలీవుడ్ ధోనీగా యవతలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బంగారు భవిష్యత్ ఉన్న మల్టీ టాలెంటెడ్ హీరో సుశాంత్ ఇలా అర్థాంతరంగా మరణించడం యావత్ సినీ లోకాన్ని షాక్ కి గురి చేసింది. సుశాంత్ మరణించడానికి బాలీవుడ్ ప్రముఖులే బాధ్యులు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు.

బాలీవుడ్ లో కొంతమంది నెపోటిజం ని ఎంకరేజ్ చేస్తూ ప్రతిభ వున్నా సరైన బ్యాక్ గ్రౌండ్ లేనివారిని తొక్కేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. కంగనా రనౌత్, ప్రకాష్ రాజ్ అభినవ్ కశ్యప్ లాంటి సెలబ్రిటీలు ఈ అంశంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యంగా కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్ లాంటి వారు బాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారిని ఎదగనివ్వరని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ, వాళ్ళందరినీ అన్ ఫాలో చేస్తూ తమ నిరసనలను తెలియజేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సుశాంత్ మరణానికి బాలీవుడ్ ప్రముఖులే కారణం అంటూ బీహార్ ముజఫర్ పూర్ కోర్ట్ లో కేసు ఫైల్ చేయబడింది. సుధీర్ కుమార్ ఓఝా అనే అడ్వకేట్ బాలీవుడ్ ప్రముఖులైన కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్ లతో పాటు మరో నలుగురి పేర్లను సూచిస్తూ సుశాంత్ బలవాన్మరణంకి వీళ్ళే కారణమంటూ ఐపీసీ సెక్షన్స్ 306 109 504 మరియు 506 క్రింద కేసు ఫైల్ చేశారు.

లాయర్ సుధీర్ కుమార్ ఓఝా మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి 7 సినిమా అవకాశాలను రాకుండా చేసారని.. అతని సినిమాలు విడుదల కాకుండా అడ్డుకున్నారని.. ఈ విధంగా అతను సూ సై డ్ చేసుకోవడానికి ప్రేరేపించారని.. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్ లతో పాటు మొత్తం 8 మందిపై కేస్ ఫైల్ చేశానని తెలియజేశారు. ఈ క్రమంలో సుశాంత్ సూ సై డ్ కేసు విషయమై ముంబయి పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపు 30 మందికి పైగా విచారించిన పోలీసులు, తాజాగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని కూడా ఎంక్వయిరీ చేశారు. సుశాంత్ ను ఏకంగా 7 సినిమాల నుంచి తప్పించారంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న గాసిప్స్ గురించి తెలిసిందే. ఇప్పుడా గాసిప్స్ నిజమే అన్నట్టు స్పందించాడు భన్సాలీ.

దాదాపు 3 గంటల పాటు పోలీసులు భన్సాలీని ఎంక్వయిరీ చేయగా.. ఆ ఎంక్వయిరీలో భాగంగా 4 సినిమాల నుంచి సుశాంత్ ను తప్పించినట్టు భన్సాలీ అంగీకరించాడు. ఎందుకలా తప్పించారని ప్రశ్నించిన పోలీసులకు, కాల్షీట్ల సమస్య వల్లనే అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. వాస్తవానికి “రామ్-లీల” చిత్రంలో సుశాంత్ నటించాల్సి ఉంది. ఆ చిత్రమే కాకుండా భన్సాలీ తీసిన మరో 3 చిత్రాల్లో కూడా సుశాంత్ ను హీరోగా అనుకున్నాడు. కానీ కాల్షీట్ల సమస్య వల్ల అతడ్ని తీసుకోలేదని పోలీసులకు చెప్పాడు భన్సాలీ. అదండి సంగతి.. మొత్తమ్మీద భన్సాలీ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అనిపించాడు. నేటి వరకు సుశాంత్ కేసులో అతడ్ని తప్పించిన ఆ 7 సినిమాల లిస్ట్ ఏంటో చెప్పాలంటూ సెటైర్లు వేసిన రామ్ గోపాల్ వర్మ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్లకూ కూడా భన్సాలీ ధీటుగానే బదులిచ్చాడన్నమాట. ఇంతకీ పోలీసుల ఎంక్వయిరీలో ఇంకా తేలని అంశమేమిటంటే.. భన్సాలీ సినిమాల నుంచి సుశాంత్ ను తప్పించమని ఎవరైనా చెప్పారా.? లేక నిజంగానే కాల్షీట్ల సమస్య వలనే సుశాంత్ ఆ ఛాన్స్ లు మిస్సయ్యాడా.? అనేది బయటపడితే కానీ ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here