“విలన్” అనే పదానికి సరైన అర్థాన్ని ఇస్తూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి బాలీవుడ్ మరియు టాలీవుడ్ చిత్రాలలో విలన్ గా క్రేజ్ ను సంపాదించుకున్న మహానుబావుడు “అమ్రిష్ పురి”. ఈ రోజు ఆయన పుట్టినరోజు సంధర్బంగా ఒక్కసారి ఆయన సినీ జ్ణాపకాలను గుర్తు చేసుకుందాం..

1932లో పంజాబ్‌లో జన్మించిన అమ్రిష్ పురి తన 39వ ఏట సినిమాల్లో అడుగుపెట్టారు. అనేక సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలే పోషించిన అమ్రిష్.. తెలుగు సినీ చరిత్రలో గొప్ప విలన్‌గా గుర్తుండిపోయారు. 1954లో ఓ సినిమాలో లీడ్ రోల్‌కు అమ్రిష్ పురిని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర నుంచి తప్పించారు. చాలా కాలం పాటు డబ్బింగ్ చెప్పిన అమ్రిష్.. 1971లో రేష్మ ఔర్ షెరా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్ లో చాలా చిత్రాలలో నటించిన అమ్రిష్ పురి చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి దొంగ సినిమాలో ఖాద్రా పాత్రలో హిప్నటైజ్ చేస్తూ డైలాగ్స్ చెప్పే పాత్ర తో టాలీవుడ్ లో బాగా పాపులరయ్యారు. అమ్రిష్ పురి వాయిస్ మాడ్యులేషన్ కి మాత్రమే సెట్ అయ్యేలా ఉంటుంది. అది ఆయన గొప్పతనం.

అలాగే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో “మహా దృష్ట్య పాళికా కపాళికా” అనే డైలాగ్ మోస్ట్ పవర్ ఫుల్ గా సినిమాకే హైలెట్ గా నిలిచి. అప్పట్లో ఈ డైలాగ్ వినగానే థియేటర్లలో అరుపులు కేకలతో రీసౌండ్ వచ్చేది. ఈవిధంగా అమ్రిష్ పురి ఏ డైలాగ్ పలికిన ఆ చెప్పేవిధానంలో ఓ వైవిధ్యం, వాయిస్ లో వినబడే కఠినత్వం, వృత్తికే అంకితమనిపించే ఆ సాధన మెండుగా కనబడతాయి. జగదేకవీరుడు అతిలోక సుందరిలో మాంత్రికుడుగా, చిరంజీవికి సైతం స్క్రీన్ మీద పోటీగా అంతటి ఎనర్జీ పెర్ఫార్మన్స్ ను ఇచ్చారంటే.. అమ్రిష్ పురి ఎంట్రీ కు ముందు, ఎంట్రీ తర్వాత అనేలా ఈ సినిమా ఉంటుంది. తెలుగులో ఈయన సినీ ప్రస్థానం చూస్తే దాదాపు అన్ని మెజీషియన్ గాను, మాంత్రికుడిగానే ఆకట్టుకున్నారు.

బాలకృష్ణ నటించిన “నిప్పు రవ్వ” చిత్రంలో బలగం అనే పాత్రలో బొగ్గు గని యజమానిగా, అవినీతి వంతుడైన రాజకీయ నాయకుడిగాను తన విలక్షణ నటనతో సినిమా విజయంలో ముఖ్య పాత్రను పోషించారు. “పగలు ప్రజారాజ్యానికి అధిపతిని, రాత్రి చీకటి రాజ్యానికి అధినేతని. ”ఈ డైలాగ్ ని అమ్రిష్ పురి వాయిస్ లో ఊహించుకోండి. మన Sr.ఎన్టీఆర్ సినిమా లో విలన్ ఏ రేంజ్ లో ఉండాలో, అంతకు మించి MP జ్ఞానేశ్వర్ రావు పాత్రలో అమ్రిష్ పూరి ఇమిడిపోయి, అద్భుతమైన డైలాగ్ డెలివరీ తో తనదైన ముద్ర వేశారు.

బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ భారీగా రెమ్యునరేషన్ తీసుకునే బెస్ట్ విలన్ మన అమ్రిష్ పురి. అసలు విలన్ పాత్రలకు సరైన అర్థం చెప్పిందే అమ్రిష్ పురి అంటే అతిశయోక్తి కాదేమో.! అలాగే బాలీవుడ్ లో అమ్రిష్ పురి సినీ ప్రయాణాన్ని గమనిస్తే అనిల్ కపూర్ హీరోగా నటించిన మిస్టర్ ఇండియా సినిమాలోని “మొగాంబో కో కుష్ హువ’. అనే డైలాగ్ బాగా పాపులరైంది. “జా సిమ్రన్ జా. జీలే అ ప్ ని జిందగీ.” దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో ఈ డైలాగ్ ని ఎవరైనా, ఎప్పటికైనా మరిచి పోగలరా? షారుఖ్ ఖాన్, కాజోల్ జోడి కి ఎంత మంచి పేరు వచ్చిందో, కాజోల్ కి కఠినమైన తండ్రి పాత్రలో అమ్రిష్ పూరి కి అంతకు మించి పేరు వచ్చింది.

అబితాబ్ బచ్చన్ “షహెన్షా” సినిమాలో మెయిన్ విలన్ గా బిగ్ బి నే డామినేట్ చేసారంటే, ఆ విలన్ పాత్రలో ఎంత బాగా నటించారో మనం అర్ధం చేస్కోవచ్చు. ఈయన చేసిన పాత్రలు ఇప్పటికి ప్రేక్షకుల మదిలో పదిలంగా ఉండడానికి కారణం ఈయన పాత్రలకు ఈయనే డబ్బింగ్ చెప్పుకోవడమే. ఈయన చేసిన సినిమాల్లో హీరో డైలాగ్స్ కంటే, ఈయన డైలాగ్స్ కే ప్రేక్షుకులు మంత్రముగ్దులయ్యేవారు. హిందీతో పాటు, తెలుగు, తమిళ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళీ భాషల్లో దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటించారు. హాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించారు. ‘అమ్రిష్ పురి నా ఫేవరెట్ విలన్’ అని హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్‌బర్గ్ చెప్పడం విశేషం. అయితే తెలుగులో నటిస్తున్న సమయంలో ఒక తెలుగు హీరో ఆయన్ని అవమానించాడని ఇకపై చచ్చినా తెలుగులో నటించానని ప్రకటించారు.. ఆ హీరో ఎవరనే దానిపై ఆప్పట్లో కొన్నిపేర్లు కూడా వినిపించాయి. ఏది ఏమైనా అంతటి ఘనత సాధించిన ఆ మహానటుడు అనారోగ్యంతో 2005లో కన్నుమూశారు. వెండితెరపై అమ్రిష్ పూరి లేని లోటును పూర్చేవారు ఎవ్వరూ లేరు.. రాలేరు.. రాబోరు.



























