Bombay Padma : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 200 పైగా సినిమాల్లో చేసినా ఇంకా అంత గుర్తింపు లేకున్నా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న పాత్రయినా చేస్తూ అటు చాలా సీరియల్స్ చేస్తూ ఉన్న ఆర్టిస్ట్ బాంబే పద్మ గారు. సినిమాల్లోకి రావడానికి ప్రయత్నించినా మొదట్లు తల్లి చేతుల్లో బాగా దెబ్బలు తిని ఆ తరువాత పెళ్ళై పిల్లలు పుట్టాక ఒక సారి ప్రయత్నిద్ధాం అనుకుని సినిమాల్లోకి వచ్చిన ఆమె సినిమా పరిశ్రమలో ఎన్నో చేదు అనుభవాలను, అలాగే ప్రశంసలను అందుకున్నారు. భర్త బాధ్యతలేకుండా ఉంటే కుటుంబం బాధ్యతలను తీసుకుని అటు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూనే ఇటు కెరీర్ కోసం కష్టపడ్డారు పద్మ. ఇక సినిమా ఇండస్ట్రీ లో ఎవరి సహాయం లేకుండా వచ్చిన బాంబే పద్మ ఇన్నేళ్లలో మొదటి సారి తన చేదు అనుభవాలను పంచుకున్నారు.

తెలిసిన వారని వెళితే దాసరి గారు బాగా అవమానించారు…
ఇండస్ట్రీ కి రావాలంటే ఎవరో ఒకరు తెలిసి ఉండాలి అలా లేకపోతే ఏదైనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళాలి అనుకుని బొంబాయి లోని ఫేమస్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి అక్కడ నటనలో శిక్షణ తీసుకున్నారు పద్మ గారు, అలా ఆమె పేరు బొంబాయి పద్మ గా మారింది. ఇక విజయవాడకు చెందిన పద్మ గారికి దాసరి నారాయణ రావు గారు ముందు నుండి తెలుసు. తన బావగారికి స్నేహితులు, దాసరి గారు పద్మ గారి బావగారు ఇద్దరూ పద్మ గారి మావయ్య జేబులో నుండి డబ్బులు తీసుకుని సిగరెట్ తాగేవారట. అంత చనువు ఉన్నా అవకాశాల కోసం ఆయన దగ్గరకు మొదట్లో వేళ్ళలేదట పద్మ గారు.

కొన్ని సినిమాల్లో చేసాక వాటిని రిఫరెన్స్ గా తీసుకుని దాసరి గారి దగ్గరికి అవకాశాల కోసం వెళితే బాగా అవమానించారట. నేనేమైనా అయన డబ్బులు కాజేసి సిగరెట్ తాగే విషయంలో అక్కడా ఇక్కడా చెబుతానని అనుకున్నారో ఏమో కానీ నాకు అవకాశం సంగతి పక్కన పెడితే తెలిసినవారని కూడా లేకుండా మాట్లాడారు. అదొక చేదు అనుభవం, పోయిన వాళ్ళ గురించి ఇంకా మాట్లాడుకోవడం బాగుండదు అంటూ పూర్తిగా ఏం జరిగిందో చెప్పలేదు.































