రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గత రెండేళ్లుగా ఎన్నో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ పిరియాడిక్ మల్టీస్టారర్ ఎట్టకేలకు మార్చి 25 న విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. టీం అందరూ ప్రమోషన్స్ లో యమ బిజీగా గడిపోస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి దేశమంతా తిరిగేస్తూ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నారు.

మరోవైపు RRR చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్ చేయాలంటూ అక్కడి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కన్నడ భాషను అవమానించేలా RRR తక్కువ దియేటర్లలో కన్నడ భాషలో రిలీజ్ చేస్తున్నారని ట్విట్టర్ లో #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పునీత్ రాజ్ కుమార్ నటించిన “జేమ్స్” మూవీ ప్రదర్శింప బడుతున్న దియేటర్లలో కూడా RRR చిత్రం ఆక్యూపై చేయడంతో పునీత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇటీవల కర్ణాటకలో జరిగిన ఈవెంట్ లో కూడా హీరో శివ రాజ్ కుమార్ RRR సినిమాను కన్నడ భాషలో విడుదల చేయాలని రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే మేకర్స్ మాత్రం కన్నడ కంటే తెలుగు భాషలోనే ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. దీనితో కన్నడ ప్రేక్షకులు మండిపడుతున్నారు.






























