తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుతం. ఈ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే నేరుగా విద్యార్థులందరినీ పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంటర్నల్ గా వచ్చిన మార్కులు, అసెస్‌మెంట్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు కేటాయించనున్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. జిహెచ్ఎంసి పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కరోనా బాధితుల సంఖ్య భారీగా నమోదవుతుంది. ఈ మహమ్మారి విజృంభణ దృష్యా రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ కారణంగా విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది.




























