కరోనా మహమ్మారి ఎవరిని వదలడంలేదు.. రాజు అయినా సామాన్య ప్రజలు అయినా సరే.. పర తమ భేదాయాలు లేవన్నట్టుగా వుంది కరోనా విజృంభణ. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే కరోనా భారిన పడిన బోరిస్.. లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజగా వ్యాధి తీవ్రత పెరగడంతో బోరిస్ ను ఐసియూకు తరలించారు. అయితే బోరిస్ ఆరోగ్యం మరింతా క్షీణించిందని ప్రధాని విదేశాంగ సెక్రెటరీ డొమినిక్ రాబ్ వెల్లడించారు.

గత మార్చి 27 వ తారీఖు నుంచి బోరిస్ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఆయనకు కరోనా పరీక్షలు నిర్వచించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో ఆసుపత్రికి తరలించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా స్పందించించారు. బోరిస్ తనకు మంచి స్నేహితుడని, అయన త్వరగా కోలుకునేలా వైద్యులు చర్యలు తీసుకోవాలని అయన అన్నారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ ఆరోగ్యం విషమంగా ఉండనే వార్తలతో బ్రిటన్ ప్రజలు అందొనలో ఉన్నారు.




























