Bullet Bhaskar : జబర్దస్త్, ఇక ఈటీవీలో వచ్చే పండగ ఈవెంట్లు, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రోగ్రాముల్లో జబర్దస్త్ వాళ్ళు తమ కుటుంబంతో పాల్గొంటు ఉంటారు. అలా చాలామంది కంటెస్టెంట్స్ ఫ్యామిలీ వాళ్లకు కూడా మంచి గుర్తింపు వచ్చింది జనాల్లో. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చాక జబర్దస్త్ వాళ్ళు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ లో కూడా స్కిట్స్, పాటలు పాడటం వంటి వాటితో వాళ్ళల్లో ఉన్న ఇతర టాలెంట్ ను చూపిస్తున్నారు.

స్టేజి మీద కుప్పకూలిన బుల్లెట్ భాస్కర్ తండ్రి…
ఇక ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల చేసారు మల్లెమాల వాళ్ళు. ఇక ప్రతి వారం ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం పెళ్ళాం చెబితే వినాలి అంటూ వచ్చారు. ఇక హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఇంకా ఇతర ఆర్టిస్టులు షోలో భార్య భాధితులుగా కనిపించి నవ్వించారు. ఇక సీరియల్ నటి శ్రీవాణి తన భర్తతో చేసిన కామెడీ ప్రోమోలో చూపించారు.

ఇక వారిద్దరు థగ్ అఫ్ వార్ లో పాల్గొనడం శ్రీవాణి తన భర్తకు పీతల పులుసు అంటూ క్యారేజ్ చూపిస్తూ థగ్ అఫ్ వార్ లో నెగ్గడం చూపిస్తారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ తన భార్య నీలిమ తో కలిసి ఓ ప్రియా ప్రియా అంటూ డాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక మగవాళ్ళకి, ఆడవాళ్ళకి థగ్ అఫ్ వార్ పెట్టగా ఆడవాళ్లు గెలవడం ఆపై రష్మీ మీద బుల్లెట్ భాస్కర్ వాళ్ళ నాన్న పంచులు బాగా పేలాయి. ఇక చివర్లో కబడ్డీ ఆడుతుండగా కూతకు వెళ్లిన బుల్లెట్ భాస్కర్ వాళ్ళ నాన్న అప్పారావు వేదిక మీద నుండి ఒక్కసారిగా పడిపోవడం చూపించి ప్రోమో ఎండ్ చేసారు. ఇపుడు బుల్లెట్ భాస్కర్ వాళ్ళ నాన్నకు ఏమైందో అన్న ఉత్కంఠ ప్రేక్షకులలో పెరిగింది. ఇక ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోంది.






























