బుల్లితెరపై లవ్ స్టోరీ లు, పులిహోర కలిపే బ్యాచ్ లకి బాగా డిమాండ్ ఏర్పడింది. ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిని బాగా చూడటంతో రోజురోజుకు ఇలాంటి లవ్ ట్రాక్ లు ఎక్కువ అవుతున్నాయి.ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి రష్మీ సుధీర్ మధ్య లవ్ ట్రాక్ లను నడిపిన షో నిర్వాహకులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా రష్మీ సుధీర్ అలాగే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న జంటలలో వర్ష – ఇమ్మానియేల్ జంట ఒకటని చెప్పవచ్చు.

ప్రస్తుతం వర్ష ఇమ్మానియేల్ జంటకు ఎంతో పాపులారిటీ ఉంది. ఈ క్రమంలోనే ఈ షో లో వీరు చేసే స్కిట్ లు, ప్రోమోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓసారి కెవ్వుకార్తిక్ తన స్క్రిప్ట్ లో భాగంగా ఈ జంటను ఉపయోగించుకొని ఎంతో పాపులర్ అయ్యాడు. ఈ స్కిట్ లో భాగంగా కెవ్వుకార్తిక్ వీరిద్దరిని విడగొడతాడు. తాజాగా ఇదే ఫార్ములాను బుల్లెట్ భాస్కర్ కూడా ఉపయోగించుకున్నాడు. వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో వర్ష ఇమ్మానియేల్ సందడి చేశారు.
వచ్చేవారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రమోషన్లో భాగంగా బుల్లెట్ భాస్కర్ తన స్కిట్ లో మొట్టమొదటిసారిగా తన తండ్రిని తీసుకువచ్చారు.ఇందులో ఇమాన్యుయేల్‌కు జోడిగా ఫైమాను సెట్ చేశారు. తనకు మాత్రం వర్షను సెట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలుగా ఉన్న వర్ష బుల్లెట్ భాస్కర్ చేసిన రొమాన్స్ చూసి ఇమ్మానియేల్ సహించలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇమ్మానియేల్ ను రెచ్చగొట్టడం కోసం బుల్లెట్ భాస్కర్ ఏకంగా వర్ష చేతికి ముద్దు పెట్టాడు. దీంతో మండి పోయిన ఇమ్మానియేల్ ఇందుకేనా జంటలను మార్చింది అంటూ తన మనసులోని బాధను బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.





























