Bulli Raju: చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు అంటే మాత్రం టక్కున ఈ కుర్రాడు అందరికీ గుర్తుకొస్తారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లి రాజు పాత్రలో రేవంత్ నటించారు. వెంకటేష్ కొడుకుగా ఈ కుర్రాడు పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి తన తల్లిదండ్రులను ఎవరైనా అంటే బూతులతో రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు..

ఇలా బుల్లి రాజు పాత్ర బాగా ఫేమస్ అయ్యింది. ఎంతోమంది ప్రేక్షకులు బుల్లి రాజు పాత్రను బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి. బుల్లి రాజు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించినా ఈ కుర్రాడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి అంత చిన్న పిల్లాడి చేత అలాంటి బూతులు తిట్టించడం ఏంటి ఎంతో మంది పిల్లలు దీనిని ఆదర్శంగా తీసుకుంటే ప్రమాదం అంటూ విమర్శలు కూడా కురిపించారు.
ఇలా ఇవన్నీ పక్కన పెడితే మాత్రం చిన్నారి రేవంత్ కెరియర్ కు ఈ బుల్లి రాజు పాత్ర ఎంతో ప్రయోజనకరంగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం రేవంత్ పెద్ద ఎత్తున సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇకపోతే ఒక సినిమా మంచి సక్సెస్ కావడంతో రేవంత్ తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసారని తెలుస్తోంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా తనని సినిమాలలోకి తీసుకోవాలి అంటే ఒక రోజుకు ఏకంగా లక్ష రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఒక్క రోజుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా లక్ష రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది స్టార్ కమెడియన్లే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదు. కానీ బుల్లి రాజు మాత్రం డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ విని నిర్మాతలు సైతం హడలిపోతున్నారు. ఒకప్పుడు బ్రహ్మానందం అలీ వంటి స్టార్ కమెడియన్లే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునేవారు కానీ ఈ రేవంత్ ఒక సినిమాకి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం అంటే షాకింగ్ న్యూస్ అని చెప్పాలి



























