పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రతిచోటా పవన్ మాటే అటు ఫిలింనగర్ లో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ హాట్ టాపిక్ గా మారారు. అటు రాజకీయాలతో, ఇటు సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ వరుసపెట్టి సినిమాలు కమిట్ అవుతున్నారు. అయితే పవన్ ప్రస్తుతం బాలీవుడ్ సెన్సేషనల్ “పింక్” సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి “లాయర్ సాబ్” అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యారట. ఈ చిత్రంలో హిందీలో అమితాబ్ పోషించిన పాత్రలో పవన్ ప్రేక్షకులకు కనిపించనున్నారు. దీనికి సంబంధించి షూటింగ్ స్పాట్ లో అయన గెడ్డంతో నడుస్తున్న లుక్ కూడా లీక్ ఆయిన సంగతి తెలిసిందే. ఇది మాత్రమే కాదు మొన్ననే క్రిష్ దర్శకత్వంలో మరో చిత్రానికి కమిట్ అయ్యాడు. పవన్ కోసం ఒక చారిత్రాత్మక కథను రెడీ చేసాడట దర్శకుడు క్రిష్. ఇక పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్ మరో సారి రిపీట్ కాబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రాన్నీ పట్టాలెక్కిస్తున్నాడు పవర్ స్టార్. మరో రెండు సినిమాలు కూడా కమిట్ అవుతున్నదని పూరి మరియు గురూజీ త్రివిక్రమ్ లతో మరో రెండు సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయని వీటిని కూడా త్వరలో వెల్లడిస్తారని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఇదంతా ఆలా ఉంటె తాజాగా మరో హాట్ టాపిక్ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ క్రిష్ తో చేస్తున్న సినిమాలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయకు అవకాశం ఇచ్చాడని, ఈ సినిమాలో బందిపోటుగా పవన్ కి సహాయం చేసే క్యారెక్టర్ చేస్తుందట ఈ హాట్ హాట్ అనసూయ. ఇదివరకే అనసూయ కొన్ని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ముద్దు గుమ్మ సుకుమార్ దర్సకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన “రంగస్థలం” చిత్రంలో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయకు సిల్వర్ స్క్రీన్ పై మంచి పేరు తెచ్చిపెట్టింది. అది చూసే ఇప్పుడు క్రిష్ ఆమెకు ఈ అవకాశం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది వరకే త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది చిత్రంలో ఆఫర్ ఇచ్చినా డేట్స్ అడ్జస్ట్ అవ్వక అప్పట్లో ఆ అవకాశాన్ని వదిలేసుకుంది అనసూయ. అయితే మరోసారి పవన్ తో నటించే అవకాశానికి ఆమె మిస్ అవకూడదని వెంటనే ఓకే చెప్పేసిందట. మార్చి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రంలో అనసూయ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయికగా ప్రజ్ఞా జైస్వాల్ ఎంపికయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here