టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ త్వరలోనే పెళ్లి పీటలేక్కబోతున్న విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.. ప్రముఖ హీరోయిన్ తో బుమ్రా పెళ్లి అని కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తుండగా ఆ హీరోయిన్ అదేమీ లేదని చెప్పిన సంగతి తెలిసిందే.. అనుపమ తల్లి బుమ్రా తో పెళ్లి కి అనుపమ సిద్ధం గా లేదని చెప్పింది అంతేకాదు వారిద్దరికీ ఎలాంటి ఎఫైర్ లేదని చెప్పింది.. ఓ సినిమా షూటింగ్ కోసమే అనుపమ గుజరాత్ వెళ్లిందని చెప్పారు. దాంతో కొన్ని రోజులుగా వీరిద్దరిపై వస్తున్న వార్తలు ఒట్టి పుకార్లే అని తేలింది..

అనుపమ తన సినిమాలతో బిజీ గా ఉంది.. ఇటు బుమ్రా కూడా ఇంగ్లాండ్ సిరీస్ పై దృష్టి పెడ్తాడు.. అయితే మరో అమ్మాయితో పెళ్లి కాబోతుందని కొన్ని రోజులనుంచి వార్తలు షికార్లు చేస్తున్నాయి.. ఈనెల 14న గోవాలో వివాహం చేసుకోబోతున్నాడని సమాచారం. అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, బుమ్రాకు కాబోయే భార్య ఎవరనే విషయంపై గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్‌ను బుమ్రా జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడని తాజా సమాచారం.

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు బుమ్రా అనూహ్యంగా వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ నుంచి సెలవులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడికి వివాహం కుదిరిందనే వార్తలు ప్రసారమయ్యాయి. దానికి తోడు దక్షిణాది సినీ తార అనుపమ పరమేశ్వరన్‌తో వివాహం జరగబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటిని అనుపమ కుటుంబసభ్యులు కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి బుమ్రా పెళ్లి వార్త ఆసక్తి రేపింది. ఒకవేళ ఇదే నిజమైతే టీమ్‌ఇండియా పేసర్‌ ఇక ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమైనట్లే. ఆపై నేరుగా ఐపీఎల్‌ 2021 సీజన్ ఆడే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here