ఒక్క సినిమాతో 50 ఎకరాలు తోట కొన్న నాగయ్య ఒక్క పూట తిండి లేక ఎలా ఇబ్బంది పడాల్సివచ్చింది.?

0
1010

చిత్తూరు నాగయ్య… అప్పటి వారైనా, ఇప్పటి వారైనా… తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులు ఆయన్ని ఇట్లే గుర్తుపడతారు. దీనికి కారణం ఆయన సినిమా రంగంలో ఒక నటుడు సంగీత కర్త గాయకుడు, దర్శకుడు, నిర్మాత, అన్ని రంగాలలో ఆయన ప్రావీణ్యం పొందారు. ఆయన చేసిన పాత్రలు పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు అనేక మంది ప్రజాదరణ పొందారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి నటుడు చిత్తూరు నాగయ్య గారు. ఆయన ఏకంగా 336 సినిమాలలో నటించారు. 1938 సంవత్సరంలో గృహలక్ష్మి చిత్రం ద్వారా ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది.

నాగయ్య గారి బాల్యం విద్యాభ్యాసం గురించి చూస్తే మార్చి 28, 1904 సంవత్సరంలో అప్పటి మద్రాసు రాష్ట్రంలోని గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. చిత్తూరు నాగయ్య గారి అసలు పేరు ఉప్పలదడియం నాగయ్య. ఈయన అప్పటి కాలం లోనే బి. ఏ వరకు చదువుకున్నారు. దీనితో ఆయన బడిపంతులుగా అనేక ఉద్యోగాల్లో పని చేయడం జరిగింది. అలాగే చిన్నప్పటి నుంచే ఆయనకు సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉండేది. దానితో పాటు ఆయనకు నాటకాలు వేయడం అంటే చాలా ఇష్టం కూడా దీనితో ఇష్టం కాస్త సినిమాలవైపు తనని నడిపించింది అని చెప్పవచ్చు.

ఇకపోతే చిత్తూరు నాగయ్య గారు ఒకానొక సమయంలో మంచి సినిమాలు తీస్తూ బాగా డబ్బు సంపాదించే వారు. అయితే ఒకానొక సమయంలో త్యాగయ్య సినిమా ద్వారా వచ్చిన ధనంతో కోడంబాకం లో తాను ఏకంగా యాభై రెండు ఎకరాల తోటను కొన్నాడు. అయితే ఆ సమయానికి ఆయన చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా, గాయకుడుగా, సంగీత దర్శకుడుగా, నిర్మాతగా విషయంలో తాను అంటే ఏంటో నిరూపించుకున్నారు. అయితే అక్కడ తీసుకున్న తోటలో తన స్నేహితుడి సలహా మేరకు స్టూడియో నిర్మించాలని తెలిపారు. అయితే అందుకోసం ఓ జమిందారు కోసం సహాయం కోరాడు అదే సమయంలో దాని పక్కనే వాహినీ సంస్థ కూడా స్టూడియో నిర్మించాలని అందుకోసం పరికరాల కొరకు అడ్వాన్సులు కూడా చెల్లించే చేశారని తెలిసింది.

అయితే ఆ సమయంలో సహాయం చేస్తానని చెప్పిన జమీందారు కూడా చేతులెత్తేయడంతో నాగయ్య ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలింది. ఇక ఆ స్టూడియో నిర్మాణం విషయంలో ఏకంగా 2 లక్షల రూపాయలు ఆయన నష్టపోయారు. అంతే కాకుండా ఆయన తన స్నేహితుడు ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయబోయి మరో యాభై వేలు కూడా తను నష్టపోయాడు. ఆ కాలంలో అంత డబ్బు అంటే మామూలు మాటలు కాదు కదా. అందుకే కొన్నాళ్ళకు ఆ తోట కూడా అమ్మయేలసి వచ్చింది నాగయ్య గారు. ఇలా అనేక చిత్రాల్లో నటించిన ఆయనకు నటరాజు నట సార్వభౌమ, నటశేఖర, నట పితామహ మొదలైన బిరుదులు ఆంధ్ర, తమిళ, కన్నడ, మలయాళ రాష్ట్రాల్లో బిరుదులు లభించాయి. ఏదిఏమైనా బాగా బతికిన నాగయ్య గారు చివరి దశలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ఆయన చివరి రోజుల్లో పేదరికాన్ని ఎక్కువగా అనుభవించారు. కేవలం వంద రూపాయల కోసం అనేక చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం కొనసాగించారు. నా జీవితం అందరికీ ఒక పాఠం అంటూ… తనకు తనకు మాలిన ధర్మం చేయకండి అపాత్ర దానం చేయకండి అంటూ చివరిగా ఆయన రాసుకున్న ఆత్మకథలో తెలిపారు.