జులాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత కొన్ని కారణాలతో వెండితెరను వదిలి బుల్లితెరపై యాంకర్ గా అవతారమెత్తింది శ్రీముఖి. ఆతరువాత బుల్లి తెరపై రాములమ్మగా ఫ్యామస్ అయిన ఈ భామ, బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా రన్నరప్ గా నిలిచింది. అయితే తాజగా యాంకర్ శ్రీముఖి పై బంజారాహిల్స్ పోలీస్టేషన్ లో కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళితే.. ఈ మధ్య కాలంలో బుల్లితెర కామెడీ షోలు వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి. తాజగా శ్రీముఖి ఒక టీవీ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరించిన ఒక షోలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా, వారిని కించపరిచేలా వ్యాఖ్యానించిందంటూ నల్లకుంట కు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీముఖితో పాటుగా, ఆ ఛానల్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




























