‘నచ్చావులే’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రముఖ హీరోయిన్, BJP నాయకురాలు మాధవీ లత లేటెస్ట్ గా ఓ క్రొత్త సమస్యలలో చిక్కుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. వివిధ అంశాలపై సెన్సేషనల్ కామెంట్స్ ను షేర్ చేసే మాధవీ లత.. తాజాగా తన ఫేస్‌బుక్‌లో ఒక కామెంట్ పెట్టింది. ఇప్పుడు ఆ కామెంటే ఆమెకు సమస్యలను తెచ్చి పెడుతుంది. వివరాల్లోకి వెళ్తే..

ఆగస్టు 14న సినీ నటి మాధవీలత తన ఫేస్ బుక్ ఖాతాలో ‘‘ITS A CHALLENGE.. హిందూ ధర్మం దాని సంరక్షణ అని పిసుక్కునే ఫేస్‌బుక్ హిందూ ధర్మ రక్షకులకు, వీరాధివీరులందరికీ, శూరులకు, దొంగ భక్తులకూ ఇదే నా విన్నపం. ఈ వీడియోను చూసి హిందువుల మీద జరిగే దాడులు చేసేవాళ్ళని ప్రశ్నించి అడిగి కడిగి వాళ్ళ దుమ్ము దులిపి తుడిచి లాగి పెట్టి కొట్టి, మీ దమ్ము చూపించి, మీ భక్తిని చూపించి, మీ గుండె ధైర్యాన్ని చూపించి ఆ తర్వాత వచ్చి నా చీర గురించి మాట్లాడండి. అలా కాదు.. కూడదు నువ్వు ఆడపిల్లవి, అబలవి, చేతకానిదానివి, డబ్బుల్లేని పేదదానివి, పదవిలేని దానివి, రాజరిక కుటుంబ నేపథ్యం లేనిదానివి కనుక, బలహీనురాలివి కనుక, మా జ్ఞానం లేని దొంగ హిందూ భక్తిని నీ మీద చూపిస్తాం అంటే చాలా సంతోషం. May God Bless you.. ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే.. వేరే మార్గం లేదంతే.. దైవం నీ పాపపు లెక్కలు రాస్తుంది, లెక్క తేల్చుతుంది కూడా.! IF NOT PLEASE SHUT UR DILTHY MOUTHS AND STAY CALM’’ అని ఒక పోస్ట్ ను షేర్ చేసింది.

ఫేస్ బుక్ లో నటి మాధవీ లత పెట్టిన కామెంట్ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని హైదరాబాద్ వనస్థలి పురంకు చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. గోపీకృష్ణ ఫిర్యాదుకు స్పందించిన. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెపై 295-A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా.. మాధవీలత ప్రస్తుతం GSSSP కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లేడీ’ అనే చిత్రంలో నటిస్తుంది. యధార్ధ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాను చరణ్స్ క్రియేషన్స్, GSSSPK స్టూడియోజ్ బ్యానర్లపై సత్యనారాయణ గొరిపర్తి, జీఎస్ఎస్ఎస్‌పి కళ్యాణ్ నిర్మిస్తున్నారు.



























