ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌పై కేసు నమోదైంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీనటి పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుత కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. గత నెల 11న పాయల్ రాజ్‌పుత్ పెద్దపల్లిలోని వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

అయితే ఆ సమయంలో పాయల్ మరియూ ఆ షాపు యాజమానులు కూడా మాస్కులు ధరించాలేదని, కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా పూర్తిగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని పెద్దపల్లికి చెందినా బొంకూరి సంతోష్ పెద్దపల్లి కోర్టులో పిర్యాదు చేసారు. ఈ క్రమంలో జూనియర్ సివిల్ ఇన్‌చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేశ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.



























