Caste controversy in YCP & Janasena : రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు కాదు శాశ్వత మిత్రులు కాదు. పక్కన స్నేహితుడిగా ఉంటూ కూడా తననే ముంచేసే వ్యూహాలు నేటి రాజకీయాల్లో తరచూ చూస్తూనే ఉంటాం. తెలంగాణ ఇవ్వగానే కాంగ్రెస్ లో పార్టీ విలీనం చేస్తా అన్న కెసిఆర్ ఆ వెంటనే మాట మార్చి రాజకీయ పార్టీగా నిలబెట్టి కాంగ్రెస్ ని మట్టికరిపించి రెండు సార్లు సీఎం అయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి అక్కడ చోటు లేకుండా చేసాడు. ఆలా రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో పసిగట్టడం అంత ఈజీ కాదు. తాజాగా ఏపీ రాజకీయాల్లో కుడా ఎవరు ఎవరికి సహాయ పడుతున్నారో అర్థం కాని పరిస్థితి. వైసీపీ పార్టీ ప్రధాన ప్రత్యర్థిని వదిలి జనసేన వెంట బాగా పడుతోంది. ఇక జనసేన వైసీపీ విమర్శలకు కౌంటర్లను ఇస్తూ రోజూ మీడియాలో నానుతున్నాయి. అయితే తాజాగా ఈ రెండు పార్టీలలో క్యాస్ట్ కలకలం రేగింది.

పవన్ కళ్యాణ్ అమ్మది ఆ కులం…
వైసీపీ నేత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాపు కాదు ఆయన తల్లిది ఎస్సీ సామజిక వర్గంలోని రెల్లి కులం కానీ అది చెప్పుకోడానికి పవన్ కి ఇష్టం లేదు అందుకే రెల్లి కులం అంటే ఇష్టం, గౌరవం అంటూ మాట్లాడుతారు కానీ అసలు విషయం చెప్పరు అంటూ విమర్శించారు. దీనికి కౌంటర్ గా నాగబాబు వీడియో వదిలారు. మా అమ్మది రెల్లి కులం కాదు. అయినా ఒకవేళ ఆ కులం అయ్యుంటే మేము చాలా గర్వించేవాళ్ళం. మీ వైసీపీ నేతల లాగా మాకు ఎస్సీ కులం అంటే చిన్నచూపు లేదు.

కుల మత పట్టింపు మా ఇంట్లో ఎవరికీ లేదు. మా తండ్రి ఉన్నతమైన భావాలతో పెంచారు. ఒకవేళ మా తల్లిది ఆ కులం అయితే చెప్పుకోడానికి మేము గర్వపడుతాం ఎందుకంటే వాళ్ళు మన కులాలన్నిటిలోనూ గొప్పకులం వాళ్ళు. మన అశుద్దాన్ని శుభ్రపరిచేది వాళ్ళే కనుక గొప్ప కులం అదే అంటూ కుల రాజకీయాలు వైసీపీ నేతలు చేయడం సిగ్గు చేటు అంటూ విమర్శించారు నాగబాబు.





























