బెయిల్ రద్దు పిటిషన్‌లో విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. వాదనలు జరుగుతన్న పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐ న్యాయస్థానం విజయసాయి రెడ్డిని ఆదేశించింది. ఈనెల 10న విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే.

వాదనలు విన్న కోర్ట్ విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి నోటీసులు అందజేసింది. విజయసాయి కోర్టు షరతులు ఉల్లంఘించారని ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు చివరకు ఆ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.