బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ బలవాన్మరణం సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు ఇప్పటికే రోజుకో క్రొత్త మలుపు తిరిగుతుంది. తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సీబిఐ కేసు నమోదు చేసింది.

బీహార్ ప్రభుత్వం సుశాంత్ కేసును సీబిఐ దర్యాప్తుకు పంపించాలని ఆదేశించారు. మరోవైపు కేంద్రం కూడా సుశాంత్ కేసులో సీబిఐ ఎంక్వైరీ కి ఆదేశించామని సుప్రీంకోర్టుకు తెలియ జేశారు. దీంతో సుశాంత్ కేసు విషయమై ముంబై పోలీసులు రియాను చాలాసార్లు.. చాలా రకాలుగా ఎంక్వైరీ చేశారు. ఈ కేసులో రియా చక్రవర్తికి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. సుశాంత్ ఉరివేసుకున్నప్పటి నుంచి రియా చక్రబర్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లావాదేవీలపైన నిఘా పెట్టింది. రియాతో పాటు బాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ నిర్మాతలు, దర్శకుల లావాదేవీలపై దర్యాప్తు మొదలు పెట్టారు. తాజాగా ఈ కేసులో సుశాంత్ మరణంపై అనుమానాలొస్తున్న నేపథ్యంలో సీబిఐ మరో ముందడుగు వేసి కేంద్ర దర్యాప్తు సంస్థ సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఏ1 ముద్దాయిగా ప్రకటించింది. మరోవైపు ఈ కేసులో ఏ2 ముద్దాయిగా ఇంద్రజిత్ చక్రవర్తి, ఏ3 ముద్దాయిగా సంధ్య చక్రవర్తి, ఏ4 ముద్దాయిగా షోవిక్ చక్రవర్తి, ఏ5 ముద్దాయిగా శామ్యూల్ మిరిండా, ఏ6 ముద్దాయిగా శృతి మోడీతో పాటు మరికొందరిని ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చింది.

ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందాన్ని సీబిఐ ఏర్పాటు చేసింది. డి.ఐ.జి గగన్ దీప్ గంభీర్ ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్నారు. సీబిఐ అధికారులు ఇప్పటికే కేసుకు సంబంధించిన పత్రాల కోసం బీహార్ పోలీసులను సంప్రదించారు. మరోవైపు ఈడి వర్గాలు రియా ఫ్రెండ్ శ్యామ్యూల్ మిరందాను, సుశాంత్ సింగ్ సి.ఏ సందీప్ శ్రీధర్ ను ప్రశ్నించారు. డైరెక్ట్ గా సీబిఐ అధికారులు సుశాంత్ కేసు విషయమై రంగంలోకి దిగడంతో సుశాంత్ మరణం వెనక దాగి ఉన్న అసలు రహస్యాలు త్వరలోనే బయటకొచ్చే అవకాశాలెక్కువగా వున్నాయని చెప్పవచ్చు.



























