కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ వదలడం లేదు. పేదల నుంచి ప్రముఖుల వరకూ.. అందరిపైనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది.

ఇప్పటి వరకు బుల్లితెర నటీనటులనే కరోనా వైరస్ వణికిస్తుంటే.. వెండితెరపై కూడా ఎందరో సినీ ప్రముఖులు ఈ కోవిడ్ 19 వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. ఇందుకు ఉదాహరణగా కొందరి సినీ నటీనటుల సమాచారాన్ని చదవండి.

ఈమధ్య కాలంలో ఇండియన్ బిగ్ బీ అమితాబచ్చన్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియడంతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతే కాకుండా అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు కోడలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అమితాబ్ తోపాటు ఫ్యామిలీ మొత్తం కరోనా నుంచి కోలుకుంటున్నారు.

లేటెస్ట్ గా కోలీవుడ్ తో పాటు తెలుగులోనూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కి, విశాల్ తో పాటు తన ఫ్యామిలీకీ కరోనా పాజిటివ్ అని తేలింది. కోలీవుడ్ హీరో విశాల్ తండ్రికి ముందు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ఆ తర్వాత విశాల్‌తో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ఒకప్పటి గ్లామర్ హీరోయిన్, సీనియర్ నటి సుమలతకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. అయితే తాజాగా సీనియర్ నటి సుమలతకు చేసిన కరోనా పరీక్షల్లో ఈమెకు కరోనా నెగిటివ్ వచ్చింది.

కోలీవుడ్‌లో అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన కొందరికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని సమాచారం.

ప్రముఖ కన్నడ హీరో ధృవ సర్జతో పాటు ఆయన భార్యకు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. దీంతో ధృవ ఫ్యామిలీ మొత్తం తమ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.



























