కవలలు జన్మించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందుకేనేమో ఈ కవల పిల్లలకు జన్మినిచ్చిన తల్లితండ్రులు ఎంతో ఆనందపడుతుంటారు. అయితే కవలలు పుట్టాక వారు చేసే పనులు అన్ని ఇతరులకు భిన్నంగా ఉంటాయి. వారిలో 5,10 నిమిషాల తేడా అక్క, చెల్లెలు లేదా అన్నదమ్ములు అవుతుంటారు.

అయితే సాధారణ వ్యక్తలకు కవలలు పుడితే ఆ ఇంటికి లేదా ఊరికి పరిమితం అవుతారు. అదే సెలబ్రేటిలకు కవలల పూడితే ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. అలా కవలలు జన్మనిచ్చిన సెలబ్రేటిలు ఎవరో…. ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది యాంకర్ ఉదయ్ భాను. ముందు ఒక ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంది. కానీ వారి దాంపత్య జీవితం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇద్దరు వీడిపోయారు. ఆ తర్వా త ఈమె విజయవాడకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కవల పిల్లలు జన్మించారు. వారు ఇద్దరు అమ్మాయిలు కావడం విశేషం.

విలక్షణ నటుడు మోహన్ బాబు కుమారుడు, టాలీవుడ్ హీరో అయిన మంచు విష్ణు…. ఇతను ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి అయిన వైస్ విరానికా రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి మొదటి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు కవలలుగా పుట్టారు. తమిళ నటుడు భరత్, షిష్లే దంపతులకు ఇద్దరు మగ కవలలు జన్మించారు. సంతోషి శ్రీకర్ వీళ్ళు టీవీ యాక్టర్స్. సంతోషికి ముందు ఒక ముస్లిం యువకుడితో వివాహం జరిగింది. వారిద్దరు విడిపోయాక మళ్ళీ నటుడైన శ్రీకర్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఇద్దరు కవలలు ఆడపిల్లలు పుట్టారు.

బాలీవుడ్ టైగర్, సీనియర్ హిరో సంజయ్‌దత్, మాన్యతా దత్ కి కూడా కవలలు పుట్టారు ఒక మగబిడ్డ, ఒక ఆడపిల్ల కవలలుగా జన్మించారు. అంతేకాదు సెలీనా మొదటి సారి పీటర్ ని దుబాయ్ లోని ఓ బట్టలషాప్ ఓపెనింగ్ లో కలిసింది. అతను తన ఫ్యామిలీ ఫ్రెండ్ అని అప్పుడే తెలిసింది. ఆ తర్వాత ప్రేమించుకోని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి కూడా ఇద్దరు మగ కవలలు జన్మించారు.

ఇక బాలీవుడ్ దర్శకుడు శిరీష్ కుందర్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన ఫర్హాఖాన్ ని ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఆడ కవలలు జన్మించారు. 2006లో జానెమన్ చిత్రం సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు.

బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జొహర్ కి కూడా కవలలు పుట్టారు. ఒకపాప ఒక బాబు పుట్టారు. బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీలియోన్, డానియల్ వెబర్ కి కూడా ఇద్దరు మగపిల్లలు కవలలుగా జన్మించారు. ఇలా చాలామంది సెలబ్రేటీలకు కవలలు జన్మించారు. ఇలా కవలలకు జన్మనివ్వడం ఒక అద్భుతమైన ఫీలింగ్ అని వారు పలు సందర్భాల్లో చెబుతుంటారు.



























