celebrities About Sharath babu : శరత్ బాబు ఎలా ఉండేవారంటే….ఆయన మరణం బాధించింది….: సీనియర్ నటుడు మురళి మోహన్

0
25

Celebrities About Sharath Babu : విలక్షణ నటుడు విలన్ గాను,హీరోగాను, తండ్రి గాను సహాయక పాత్రల్లో ఇలా ఏ పాత్రయినా అందులో ఒదిగిపోయి నటించే ఆర్టిస్ట్ అప్పట్లో శరత్ బాబు గారు. రామ రాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. ఆముదల వలస లో జన్మించిన ఆయన చెన్నై కి సినిమాల కోసం వచ్చారు. అలా రామ రాజ్యం, కన్నె మనసులు, పంతులమ్మ, సీతకొక చిలుక,చిలకమ్మ చెప్పింది వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన 1981,88,89 మూడు సార్లు ఉత్తమ సహాయక నటుడుగా నంది పురస్కారం సైతం అందుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు గారు పోరాడి ఓడిపోయారు. ఆయన గురించి సీనియర్ నటుడు మురళి మోహన్ ఆయన అనుబంధాన్ని పంచుకున్నారు.

ఆయన అంత్యక్రియలు అక్కడే….

మురళి మోహన్ గారు శరత్ బాబు గారి పార్థివ దేహానికి నివాళులు అందించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ తెలుగు ఆర్టిస్టులందరు చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయినా కూడా శరత్ బాబు గారు చెన్నై లో సెటిల్ అయ్యారు. ఆయన దాదాపుగా ఐదు భాషల్లోను నటిస్తూ బిజీగా ఉండేవారు. అయితే తెలుగులో కూడా ఆయనకు మంచి పేరుంది అభిమానులున్నారు.

అందుకే ఆయనను చూడటానికి వచ్చేవారి కోసం ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన పార్థివ దేహం ఉంచాలని వారి కుటుంబ సభ్యులను అడిగి కొద్ది గంటలు ఇక్కడే ఉంచేలాగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇక చెన్నై లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి అంటూ చెప్పారు. ఆయన అయ్యప్పదీక్ష తీసుకుంటూ ఉండేవారు అలా రాజేంద్రప్రసాద్ ఆయన కలిసి అయ్యప్ప మాల వేయడం ఆపైన నేను వారితో కలిసి దీక్ష తీసుకుని వెళ్లడం చేయడం ద్వారా మరింత పరిచయం పెరిగిందని చెప్పారు మురళీమోహన్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.