ఒకప్పుడైతే సినిమా హీరోలు పెళ్లిళ్లు తొందరగా చేసుకునేవారు. ఇక పిల్లలను కూడా తొందరగానే కనేవారు. ఎందుకంటే ఇండస్ట్రీలో తమ పిల్లలను తొందరగా వారసులుగా ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేసుకునేవారు. అయితే ఇటీవల కాలంలో పెళ్లిళ్లు తొందరగా చేసుకుంటున్నారు. కానీ పిల్లల విషయంలో మాత్రం సినిమా హీరోలు చాలా భయపడిపోతున్నారు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే పెళ్లిళ్లు సంవత్సరాలు గడిచి పోతున్నాయి తప్ప ఇప్పటి వరకూ పిల్లల కనడానికి దూరంగా ఉంటున్నారు చాలామంది సినీ సెలబ్రిటీలు. ఇక ఇలాంటి వారిలో ఉపాసన రాంచరణ్ లు కూడా ఉన్నారు.

వీరి పెళ్లయి ఎన్నో ఏళ్ళు గడిచి పోతుంది రామ్ చరణ్ ఉపాసన ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. బుల్లి రామ్ చరణ్ బుల్లి ఉపాసన ఎప్పుడు రాబోతున్నారూ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూ కు హాజరైన ఉపాసన.. అది నా పర్సనల్ విషయం మీకు చెప్పాల్సిన పనిలేదు. ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు అంటూ గట్టిగా చెప్పడంతో ఇక ఇప్పుడు ఈ ప్రశ్నలు అడగడమే మానేసారు అందరు. ఇంతకీ రామ్ చరణ్ ఉపాసన పిల్లలు విషయంలో ఎందుకు ఇంతలా భయపడిపోతున్నారు అనే అందరూ చర్చించుకుంటున్నారు.

అయితే నాగచైతన్య సమంత విషయంలో కూడా ఇలాంటి ఒక టాక్ బలంగా వినిపించింది. సమంతా సినిమాలతో బిజీగా ఉండటం ఇక పిల్లలు కనడం విషయంలోనే మనస్పర్ధలు వచ్చే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారు అంటూ అప్పట్లో టాక్ వినిపించింది. మరోవైపు సమంతకు పిల్లలు కనడానికి ఇష్టం ఉన్నప్పటికీ నాగచైతన్య అంగీకరించక పోవడంతో ఈ విషయం విడాకులకు దారి తీసింది అని కూడా టాక్ వినిపించింది. ఇంతకీ వీరిద్దరూ ఎందుకు పిల్లల విషయంలో లేట్ చేసారు అన్నది మాత్రం ఎవరికి తెలియని ప్రశ్న.

ఇలాగే అటు కొత్త బంగారు లోకం తో గుర్తింపు సంపాదించుకున్న వరుణ్ సందేశ్ హీరోయిన్ గా కంటే బిగ్బాస్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వితిక దంపతులు కూడా పిల్లల విషయంలో ఎందుకు భయపడుతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. తన భార్య వితిక కు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయని.. వాటిని సాధించే క్రమంలో నే పిల్లలాను ఆలస్యంగా కనాలని నిర్ణయం తీసుకున్నాము అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు వరుణ్ సందేశ్. ఏది ఏమైనా ఇక ఇలా హీరోలు పిల్లల విషయంలో కాస్త లేట్ చేస్తూ ఉండడం మాత్రం అభిమానులను కూడా నిరాశ పరుస్తూనే ఉంది అని చెప్పాలి.
































